Advertisementt

Ads by CJ

'శౌర్య' సినిమా పాటలు విడుదల!

Mon 01st Feb 2016 01:50 PM
shourya movie music launch,manchu manoj,mohan babu,dasarath  'శౌర్య' సినిమా పాటలు విడుదల!
'శౌర్య' సినిమా పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. మంచు మోహన్‌బాబు బిగ్ సీడీను విడుదల చేయగా బి.గోపాల్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ.. ''ఏ చిత్రానికైనా కెప్టెన్ దర్శకుడే. దసరథ్ మా బ్యానర్ లో మంచు మనోజ్ తో 'శ్రీ' అనే మూవీ చేశాడు. ఇప్పుడు శౌర్య మూవీ చేశాడు. మనోజ్ ఎలాంటి పాత్ర చేస్తే చూడాలనుకున్నానో అలాంటి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. వేదా చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. భవిష్యత్తులో తను గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. నిర్మాత శివకుమార్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారు. దర్శక నిర్మాతలకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది'' అని అన్నారు.  

బి.గోపాల్‌ మాట్లాడుతూ.. ''దశరథ్‌ మంచి సినిమాలు తీశాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలి'' అని అన్నారు. 

రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ.. ''నిర్మాత శివకుమార్‌ గారితో ఎప్పటి నుండి పరిచయం ఉంది. మంచి నిర్మాత. ఇలాంటి చిత్రాన్ని ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని అన్నారు. 

దశరథ్‌ మాట్లాడుతూ.. ''ఇదొక థ్రిల్లర్ లవ్ స్టొరీ. శివకుమార్‌గారు చాలా ప్యాషనేట్‌ ఉన్న నిర్మాత. మనోజ్‌ లేకుంటే శౌర్య ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్‌వర్కింగ్‌ పర్సన్‌. సినిమాటోగ్రఫీ, వేదా మ్యూజిక్ చాలా బావుంటుంది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని అన్నారు. 

మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. ''ఇక్కడకి మమల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్‌'' అని అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ వేదా.కె మాట్లాడుతూ.. ''ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, మనోజ్‌ అన్నకు థాంక్స్‌'' అని అన్నారు.

శ్రీవాస్‌ మాట్లాడుతూ.. ''దశరథ్‌ సాఫ్ట్‌ డైరెక్టర్‌. తన తమ్ముడు వేదను మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా మనోజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలిచిపోతుంది'' అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చంద్రమహేష్‌, బెక్కం వేణుగోపాల్‌, వీరశంకర్‌, బ్రహ్మానందం, ఆర్‌.పి.పట్నాయక్‌, శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్‌, బెనర్జీ, జి.వి, ప్రభాష్‌ శ్రీను, షకక శంకర్‌, సత్యప్రకాష్‌, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్‌, చంద్రకాంత్‌, రూప ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి స్టంట్‌: వెంకట్‌, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్‌: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్‌, రచన: గోపి మోహన్‌, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మ్హర్‌భట్‌ జోషి, నిర్మాత: మల్కాపురం శివకుమార్‌, దర్శకత్వం: దశరథ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ