Advertisement

'స్పీడున్నోడు' ప్లాటినం డిస్క్ వేడుక!

Sun 31st Jan 2016 08:17 PM
spedunnodu platinum disc function,bellamkonda sai srinivas,bheemaneni srinivas  'స్పీడున్నోడు' ప్లాటినం డిస్క్ వేడుక!
'స్పీడున్నోడు' ప్లాటినం డిస్క్ వేడుక!
Advertisement

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ 'సుందరపాండ్యన్'కు రీమేక్ గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'స్పీడున్నోడు'. భీమనేని సునీత నిర్మాత. ఇటీవల విడుదల చేసిన సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్ లోని ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. నటుడు నాగార్జున, వెంకటేష్ లు చిత్రబృందానికి ప్లాటినం డిస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా..

నాగార్జున మాట్లాడుతూ.. ''సాయి శ్రీనివాస్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సినిమా పాటలు చాలా బావున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ చూశాను. శ్రీనివాస్ చాలా బాగా నటించాడు. బెల్లంకొండ సురేష్ గారు అగ్రెసివ్, డైనమిక్ ప్రొడ్యూసర్. నాగచైతన్యతో తడాఖా సినిమా చేశారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలి'' అని చెప్పారు. 

వెంకటేష్ మాట్లాడుతూ.. ''చాలా తక్కువ మందికి ఇలాంటి టైటిల్స్ సూట్ అవుతాయి. శ్రీనివాస్ తన డాన్సులు, ఫైట్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. తనకు 'స్పీడున్నోడు' టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్. మంచి స్క్రిప్ట్ తో సినిమా చేస్తున్నారు. పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ఈరోజుల్లో సినిమాను చిత్రీకరించడం దానిని రిలీజ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. మంచి కథ దొరకడమే చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. అందుకే జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకొని రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నాను. మూడు సంవత్సరాలుగా ఓ రీమేక్ స్క్రిప్ట్ ను నమ్ముకొని వర్క్ చేశాం. నాతో పాటే మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ట్రావెల్ చేశాడు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. ఆడియో కంటే సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకొని సినిమా చిత్రీకరించాం. చాలా ట్రెండీగా ఉంటుంది. సాయి శ్రీనివాస్ సినిమా కథ విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యాడు. చాలా మెచ్యూర్డ్ గా నటించాడు'' అని చెప్పారు.

సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''వసంత్ మ్యూజిక్, రీరికార్డింగ్ చాలా బావుంటుంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. అందరు కష్టపడి పని చేశారు. భీమనేని గారు ఎంతో ప్యాషన్ తో సినిమా చేశారు'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అలీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, మధునందన్, శ్రీనివాస్ రెడ్డి, పోకూరి బాబురావు, పృథ్వి, వసంత్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: డి.జె.వసంత్, ఎడిటర్: గౌతంరాజు, కెమెరామెన్: విజయ్ ఉలాగనథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల, మాటలు: భీమనేని శ్రీనివాసరావు, ప్రవీణ్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నే, నిర్మాత: భీమనేని సునీత, స్టొరీ డెవలప్మెంట్-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: భీమనేని శ్రీనివాసరావు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement