Advertisement

'పడేసావే' పాటలు విడుదల!

Wed 27th Jan 2016 04:22 PM
padesave music launch,nagarjuna,raghavendrarao,chunia,karthik  'పడేసావే' పాటలు విడుదల!
'పడేసావే' పాటలు విడుదల!
Advertisement

కార్తిక్ రాజు, నిత్య శెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై చునియా దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'పడేసావే'. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. రాఘవేంద్రరావు, నాగార్జున కలిసి బిగ్ సీడీను ఆవిష్కరించారు. రాఘవేంద్రరావు గారు ఆడియో సీడీలను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ''పడేసావే అంటే ఆడియన్స్ ని పడేయడానికే చునియా ఈ టైటిల్ పెట్టినట్లుంది. రాజమౌళి దగ్గర ప్రేక్షకులను ఎలా పడేయాలో నేర్చుకుంది. నా దగ్గర పని చేసేప్పుడు సీన్ అనేప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉండేది. సాంగ్స్ అనేప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించేది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, అనంతశ్రీరాం లిరిక్స్ ఇలా మంచి టీం తో కలిసి ఈ సినిమాకు వర్క్ చేసింది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

నాగార్జున మాట్లాడుతూ.. ''చునియాకు నా బ్లెసింగ్స్ పెద్ద అండ. అనూప్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. అనూప్ కెరీర్ లో మరొక హిట్ ఆల్బం అవుతుంది. చునియా అడిగిన వెంటనే కాదనకుండా మ్యూజిక్ చేసిపెట్టాడు. చునియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా చూసి నేనే ప్రమోట్ చేయాలనుకున్నాను. అంతలా నన్ను సినిమా ఆకట్టుకుంది. సినిమా చూసిన వెంటనే చునియా నాకొక స్క్రిప్ట్ చెప్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. తను వెంటనే ఒక కథ ఉంది వింటారా అని అడిగింది. చాలా సంతోష పడ్డాను. ఇప్పటివరకు చాలా ట్రైయాంగల్ లవ్ స్టోరీస్ వచ్చాయి కాని అవన్నీ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవే. మొదటిసారిగా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేశారు. అసలు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ప్రేమించాలనుకుంటారు. ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటారనే విషయాలను చునియా ఈ సినిమా క్లియర్ గా చెప్పింది. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

నాగసుశీల మాట్లాడుతూ.. ''అనూప్ మా కుటుంబంలో వ్యక్తి. చాలా సినిమాలకు తన మ్యూజిక్ సోల్. కార్తీక్ డాషింగ్ గా కనిపిస్తున్నాడు. చునియా నవ్వుతూ అందరితో పని చేయించుకుంటూ తన కావాల్సింది సాధించుకుంటుంది'' అని చెప్పారు. 

బి.జయ మాట్లాడుతూ.. ''చునియా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నాగార్జునల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. నాగార్జున గారి ప్రోత్సాహంతో దర్శకురాలిగా పరిచయమవుతుంది. అనూప్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చునియా ఈ సినిమాతో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

సుశాంత్ మాట్లాడుతూ.. ''అనూప్ కంటిన్యూస్ హిట్స్ ఇస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. కార్తిక్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

బి.గోపాల్ మాట్లాడుతూ.. ''నాగార్జునకు మంచి హృదయం ఉంది. ఎప్పుడు కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఉంటారు. అనుప్ మనం, సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా పాటలు కూడా చాలా బావున్నాయి. మా స్నేహితుడు వైజాగ్ రాజు కొడుకు  కార్తిక్ నటిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన చునియా ఈ సినిమాతో మంచి డైరెక్టర్ కావాలి'' అని చెప్పారు. 

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ''లేడీ డైరెక్టర్స్ తక్కువ ఉన్న ఫిలిం ఇండస్ట్రీకు కొత్త లేడీ డైరెక్టర్ పరిచయమవుతుంది. అనూప్ మ్యూజిక్ చాలా బావుంది. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

అలీ మాట్లాడుతూ.. ''నాగార్జున గారు నేను హీరోగా నటించిన 'యమలీల' సినిమా ఓపెనింగ్ కు క్లాప్ కొట్టారు. ఆ సినిమా హైదరాబాద్ లో సంవత్సరం ఆడింది. ఆయనది 

కళ్యాన్ కృష్ణ మాట్లాడుతూ.. ''సాంగ్స్ చాలా బావున్నాయి. నా ఫ్రెండ్స్ చునియా, అనూప్ కలిసి వర్క్ చేస్తోన్న ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.  

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్, చోటా కె నాయుడు, చునియా, కార్తిక్, నిత్య శెట్టి, నరేష్, అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: కన్నా కునపరెడ్డి, ఎడిటింగ్: ధర్మేంద్ర.కె, డైలాగ్స్: కిరణ్ కుమార్, లిరిక్స్: అనంత్ శ్రీరాం, స్టంట్స్: వెంకట్, కోరియోగ్రఫీ: రాజు సుందరం, విజయ్, చంద్రకిరణ్, డైరెక్టర్: చునియా.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement