Advertisementt

'లజ్జ' మూవీ టీజర్ లాంచ్!

Mon 25th Jan 2016 05:24 PM
lajja movie teaser launch,narasimha nandi,madhumita  'లజ్జ' మూవీ టీజర్ లాంచ్!
'లజ్జ' మూవీ టీజర్ లాంచ్!
Advertisement
Ads by CJ

మధుమిత, శివ, వరుణ్ ప్రధాన పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మి నరసింహ సినిమా పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'లజ్జ'. బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాత. ఈ చిత్రం టీజర్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా..

బి.గోపాల్ మాట్లాడుతూ.. ''టీజర్ చాలా బావుంది. నరసింహ నంది మంచి ధైర్యం ఉన్న దర్శకుడు. కొత్తగా ఆలోచించి సినిమాలు చేసి తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చాడు. తన దర్శకత్వంలో వస్తోన్న ఈ 'లజ్జ' టీజర్ చూస్తుంటే అంకూర్ సినిమా గుర్తొస్తుంది. హీరోయిన్ మధుమిత చాలా అందంగా ఉంది. ఖచ్చితంగా తను పెద్ద హీరోయిన్ అవుతుంది'' అని చెప్పారు.

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ''నా స్నేహితుడు కొడుకు వరుణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. డైరెక్టర్ నరసింహ ఈ సినిమా కథ చెప్పాడు. వినగానే సినిమా ఎప్పుడు వస్తుందో.. అని వెయిట్ చేస్తున్నాను. సమాజంలో ఉన్న సమస్యలను సినిమాలుగా తెరకెక్కించి సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నరసింహ నంది మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని రొమాంటిక్ మూవీగా చిత్రీకరించాను. ప్రతి అమ్మాయి పెళ్ళైన తరువాత తన భర్త ప్రేమ తనకే సొంతం కావాలని కలలు కంటుంటుంది. భర్తను దగ్గర్నుంచి ప్రేమను పొందలేకపోయిన తన మనసుకు దగ్గరగా లేకపోయినా, తన ఆలోచనలు అర్ధం చేసుకోలేకపోయినా అలాంటి సందర్భాల్లో అమ్మాయి ఆలోచనలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, అనేది ఈ చిత్ర కథ. తన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే పాత్రలో నటి మధుమిత చాలా అధ్బుతంగా నటించింది. మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ప్రొడ్యూసర్ సపోర్ట్ మర్చిపోలేనిది. హీరోయిన్ బోల్డ్ క్యారెక్టర్ లో అధ్బుతంగా నటించింది. ఇప్పటివరకు ఆర్ట్ తరహా చిత్రాలనే తెరకెక్కించాను. మొదటిసారి ఆర్ట్ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమా తీశాను. ఇకనుండి ఈ బ్యానర్ లో సంవత్సరానికి ఒక సినిమా చొప్పున తీయాలనుకుంటున్నాను. సెన్సార్ వాళ్ళు సినిమా చూసి అధ్బుత కావ్యంలా ఈ సినిమా చేసావని చెప్పారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నిర్మాత తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ''స్టొరీ చెప్పగానే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. చాలా చక్కగా చిత్రీకరించారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో వనమాలీ, ఆర్.పి.పట్నాయక్, సుక్కు, శివ, మహంతి, పి.ఎల్.కె.రెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సహనిర్మాతలు: పి.ఎల్.కె.రెడ్డి, పాశం వెంకటేశ్వరులు, కె.రవిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బుజ్జి, ఎ.శ్రీనివాస్, కృష్ణ, బ్రహ్మవలి, కెమెరా: ఎస్.మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్: వి.నాగిరెడ్డి, సంగీతం: సుక్కు, పాటలు: వనమాలీ, నిర్మాత: బూచేపల్లి తిరుపతి రెడ్డి, రచన-దర్శకత్వం: నరసింహ నంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ