Advertisement

నాలుగు మూల స్థంభాలు వాళ్ళే:ఎన్టీఆర్!

Fri 22nd Jan 2016 08:07 PM
nannaku prematho success meet,ntr,sukumar,rakul preeth singh  నాలుగు మూల స్థంభాలు వాళ్ళే:ఎన్టీఆర్!
నాలుగు మూల స్థంభాలు వాళ్ళే:ఎన్టీఆర్!
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. జనవరి 13న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''మేము చేసిన ప్రయత్నాన్ని నిశ్వార్ధంగా,నిజయీతీగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను కన్న నా తల్లి తండ్రులకు, భౌతికంగా మా మధ్య లేకపోయినా.. తన ఆశీర్వాదాలు అందిస్తున్న మా తాత గారికి నా ధన్యవాదాలు. సుకుమార్ నేను ఏదోక సినిమా చేయాలని కాకుండా జీవితాంతం గుర్తుండిపోయే సినిమా చేయాలనుకున్నాం. నా 25 వ సినిమా ఇంత మంచి అనుభూతి మిగిల్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా హిట్ అయిందా..? ఎంత కలెక్ట్ చేసిందని..? కాకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ మంచి సినిమా తీసామని గర్వంగా అనిపించాలి. 'నాన్నకు ప్రేమతో' సినిమా అదే కోవకు చెందుతుంది. నేను, సుకుమార్ ఎంత వ్యామోహంతో ఈ సినిమా చేసామో.. మాకంటే రెట్టింపు వ్యామోహంతో ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మించారు. మా ప్రయత్నానికి దేవిశ్రీ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు. అధ్బుతమైన విజువల్స్ అందించిన విజయ్ గారికి థాంక్స్. రకుల్ చాలా కష్టపడి ఈ సినిమాలో నటించింది. ఈ సినిమాకు జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుకుమార్, బివిఎస్ఎన్ లు నాలుగు మూల స్థంభాలు. కొన్ని వేల, లక్షల తండ్రుల మొహాలను తనలో నింపుకొని నటించిన రాజేంద్రప్రసాద్ గారికి థాంక్స్. జగపతిబాబు గారు విలన్ క్యారెక్టర్ లో నటించకపోతే చాలా లాస్ అయ్యేవాళ్ళం. రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ వర్సటైల్ యాక్టర్స్. సినిమా వసూళ్ళ కంటే దాని వలన వచ్చే గౌరవమే మాకు ముఖ్యం. ఈ సినిమాతో అంత మంచి రెస్పెక్ట్ నేను గైన్ చేశాను. మమల్ని ప్రోత్సహిస్తూ ఉన్న అభిమానులకు నా థాంక్స్'' అని చెప్పారు.

సుకుమార్ మాట్లాడుతూ.. ''ఆనందంతో అలిసిపోయాను. సినిమా సక్సెస్ తో అలసిపోయాను. మాట్లాడానికి మాటలు మిగల్లేదు. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన ప్రతి టెక్నీషియన్స్ కు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లకు థాంక్స్. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు'' అని చెప్పారు.

బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా 15 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే వృద్ధాశ్రమాలు ఉండేవి కావనే కామెంట్స్ విన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. లెక్కలు చెప్పే లెక్కలు మాస్టార్ సుకుమార్ కంటే ప్రేక్షకులే పెద్ద ప్రొఫెసర్లు. మంచి మార్కులు వేసి సినిమాను హిట్ చేశారు'' అని చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ''అతి తక్కువ సినిమాలతో సంతృప్తి అనేది కలుగుతుంది. ఈ సినిమాతో నాకు అది లభించింది. నేను న్యాచురల్ గా నటించడానికి సుకుమార్ గారు ఎంతో హెల్ప్ చేశారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ యాక్టర్. ఓ మంచి నటుడితో కలిసి పని చేస్తే మన పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఎంతో నేర్చుకున్నాను. ప్రసాద్ గారికి స్పెషల్ థాంక్స్. ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

జగపతిబాబు మాట్లాడుతూ.. ''హిట్ లిస్టు ను టార్గెట్ చేసిన సినిమా ఇది. సినిమాలో హీరో, విలన్ రొమాన్స్ హైలైట్ గా నిలిచింది. సుకుమార్ సినిమా మొదలుపెట్టినపుడే రొమాన్స్ అదిరిపోవాలని చెప్పారు. నిజంగానే అదిరిపోయింది. సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement