Advertisement

'కళావతి' పాటలు విడుదల!

Mon 18th Jan 2016 01:13 PM
kalavathi audio launch,siddharth,sundar c,maruthi  'కళావతి' పాటలు విడుదల!
'కళావతి' పాటలు విడుదల!
Advertisement

సిద్ధార్థ్‌, త్రిష, హన్సిక, పూనవమ్‌ బాజ్వా, సుందర్‌.సి ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందించిన 'అరన్మణి 2' చిత్రాన్ని సర్వాంత్‌ రామ్‌ క్రియేషన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌పై జవ్వాజి రామాంజనేయు సమర్పకుడుగా 'కళావతి' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సుందర్‌.సి దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్‌ సీడీని, ఆడియో సీడీలను దిల్‌రాజు విడుదల చేసి తొలి సీడీని సుందర్‌.సి కు అందించారు. 

ఈ సందర్భంగా....

సుందర్‌.సి మాట్లాడుతూ.. ''పెద్ద సక్సెస్‌ సాధించిన 'చంద్రకళ' సినిమాను సీక్వెల్‌ చేయానుకోలేదు. అయితే ఆ సినిమా క్లైమాక్స్ లో దెయ్యం ఆ బంగ్లాలో ఉన్నట్లు చూపించాను. దాంతో చాలా మంది సీక్వెల్‌ చేస్తున్నారా..? అని అడిగారు. తరువాత ఎందుకు సీక్వెల్‌ చేయకూడదని ఆలోచించి మొదటి పార్ట్‌ కంటే భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని అన్నారు.

సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. '' సుందర్‌.సి గారితో చాలా రోజులుగా మంచి పరిచయం ఉంది. ఇదివరకు ఆయన దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేశాను. ఇదొక మంచి కథ, బిగ్‌ బడ్జెట్‌ సినిమా. సుందర్ గారికి ఎక్కడ భయపెట్టాలో, ఎక్కడ థ్రిల్‌ చేయాలో బాగా తెలుసు. తమిళంలో నేను హీరోగా, ఖుష్బూ నిర్మాతగా, సుందర్‌గారు దర్శకుడిగా ఫ్రెండ్స్‌లా కలిసి ఈ సినిమాను తెరకెక్కించాం. తెలుగులో మారుతిగారు ఆయన స్నేహితులతో కలిసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా మంచి హిట్‌ కావాలి'' అని అన్నారు. 

ఖుష్బూ మాట్లాడుతూ.. ''సుందర్‌.సి గారు అనుకున్న టైంలో సినిమాను పూర్తి చేసేస్తారు. తెలుగులో 'చంద్రకళ' ఎంత పెద్ద హిట్టయిందో అందరికి తెలుసు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రాన్ని జనవరి 29న తెలుగులో విడుదల చేయాలనుకుంటున్నాం. జవ్వాజిగారి సపోర్ట్‌ మరచిపోలేనిది. సుందర్‌గారు త్వరలోనే తెలుగులో నేరుగా సినిమా చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

దిల్‌రాజు మాట్లాడుతూ.. ''మారుతి అండ్‌ టీం కలిసి గుడ్‌ ఫ్రెండ్స్‌లాగా 'కళావతి' చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. 'చంద్రకళ' కంటే ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి'' అని అన్నారు. 

మారుతి మాట్లాడుతూ.. '' 'కళావతి' చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది. సుందర్‌గారు తమిళంలో మంచి బ్రాండ్‌ ఉన్న దర్శకుడు. సిద్ధార్థ్‌ తొలిసారిగా హర్రర్‌ సినిమాలో నటించాడు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అని అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌, నిర్మాణం: గుడ్‌ ఫ్రెండ్స్‌, దర్శకత్వం: సుందర్‌.సి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement