Advertisementt

'అబ్బాయితో అమ్మాయి' సక్సెస్ మీట్!

Mon 04th Jan 2016 11:41 PM
abbayitho ammayi success meet,nagashourya,pallak lalwani,ramesh varma  'అబ్బాయితో అమ్మాయి' సక్సెస్ మీట్!
'అబ్బాయితో అమ్మాయి' సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. జనవరి 1న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 

దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ.. ''జనవరి 1న విడుదల ఈ చిత్రం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.

నాగశౌర్య మాట్లాడుతూ.. ''రమేష్ వర్మ గారు నాకు సక్సెస్ మూవీ ఇచ్చారు. అన్ని ఏరియాల్లో సినిమాకు మంచి రెస్పాన్స్  వస్తోంది. సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్'' అని చెప్పారు.

పల్లాక్ లల్వాని మాట్లాడుతూ.. ''సక్సెస్ ఫుల్ చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఆడియన్స్ ఇంకా బాగా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

శాస్త్రి మాట్లాడుతూ.. ''సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నాగశౌర్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ వచ్చిన సినిమా ఇది. కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. హీరోకు, సంస్థకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే సినిమా'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, మ్యూజిక్: ఇళయరాజా, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, లిరిక్స్: రెహ్మాన్, యాక్షన్: వెంకట్ శ్రీను, నిర్మాతలు: వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్, దర్శకత్వం: రమేష్ వర్మ.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ