Advertisement

'రెండు అక్షరాలు' ఆడియో విడుదల!

Wed 23rd Dec 2015 02:38 PM
rendaksharalu audio release,srinivasarao,devadas reddy  'రెండు అక్షరాలు' ఆడియో విడుదల!
'రెండు అక్షరాలు' ఆడియో విడుదల!
Advertisement

లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం దర్శకత్వంలో శ్రీ కంచమ్మతల్లి సినీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై  దేవదాస్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'రెండు అక్షరాలు'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. కోన రవికుమార్‌ బిగ్‌ సీడీని, తీగ కృష్ణారెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...

తీగ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''రెండు అక్షరాలపై అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న ఇలా ఎన్నో పదాలున్నాయి. అలాగే ప్రేమ కూడా రెండు అక్షరాలే. ప్రేమపై చాలా సినిమాలు వచ్చాయి. పెద్ద సక్సెస్‌ను సాధించాయి. అలాగే సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. ట్రైలర్స్‌, పాటలు బావున్నాయి. సినిమా పెద్ద హిట్‌ సాధించి యూనిట్‌కు మంచి పేరు  రావాలి'' అని అన్నారు. 

వి.సముద్ర మాట్లాడుతూ ''టైటిల్‌ చాలా బావుంది. సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించి యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి'' అని అన్నారు. 

దర్శకుడు శ్రీనివాస్‌ రావు.ఎం. మాట్లాడుతూ ''నిర్మాత గారు మంచి సపోర్ట్ అందించారు. మంచి మ్యూజిక్‌ కుదిరింది. నటీనటులు, టెక్నిషియన్స్‌ అందించిన సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం'' అన్నారు. 

నిర్మాత దేవదాస్‌రెడ్డి మాట్లాడుతూ ''మాది శ్రీకాకుళం. హీరో లోకేష్‌రెడ్డి నాకు మంచి ఫ్రెండ్. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకంతో ఉన్నాం'' అన్నారు. 

కిరణ్‌, అచర్ణరెడ్డి, మణికిరణ్‌ రెడ్డి, సుమన్‌శెట్టి, చిట్టిబాబు, నాగిరెడ్డి, శ్రీ, రాకెట్‌ రాఘవ, షేకింగ్‌ శేషు, గెటప్‌ శ్రీను తదితయి నటించిన ఈ చిత్రానికి మాటు: సిద్దె సురేష్‌, సంగీతం: నందా, పాటు: నందకిషోర్‌ కె., వెంకటేష్‌.కె, అక్షయ్‌, శ్రీనివాస్‌రావు.ఎం, ఆర్ట్‌: తెంగాణ సూర్య, ఫోటోగ్రఫీ: ఇ.సత్యహరిశ్చంద్రప్రసాద్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, డ్యాన్స్‌: ఫ్రేమ్‌ గోపి, నిర్మాత: పై దేవదాస్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ రావు.ఎం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement