Advertisement

'డిక్టేటర్' సంక్రాంతికే: బాలకృష్ణ!

Mon 21st Dec 2015 01:48 PM
dictator audio release,balakrishna,srivas,anjali,sonal chowhan  'డిక్టేటర్' సంక్రాంతికే: బాలకృష్ణ!
'డిక్టేటర్' సంక్రాంతికే: బాలకృష్ణ!
Advertisement

నందమూరి బాలకృష్ణ హీరోగా, అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాస్వ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం 'డిక్టేటర్'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం అమరావతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ రాయపాటి సాంబశివరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను నందమూరి బాలకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా...

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ''మౌర్యులు, కాకతీయులు, గజపతి రాజులు ఇలా ఎందరో రాజులు పరిపాలించిన నేల ఈ అమరావతి. ఇంద్రుడి రాజధాని కూడా అమరావతే. బుద్దుడు తిరిగిన నేల ఇది. ఇలాంటి గొప్ప ప్రదేశంలో ఆడియో వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు తమన్ తో మొదటిసారిగా కలిసి పని చేశాను. చక్కటి బాణీలను సమకూర్చారు. శ్రీవాస్ మంచి వాతావరణంలో అప్పుడే సినిమా పూర్తయిందా..? అనేలా సినిమా కంప్లీట్ చేసేశారు. నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్యాం.కె.నాయుడు సినిమాలో ఎంతో అందంగా చూపించారు. సోనాల్ చౌహాన్ ఇంతకముందే నాతో ఓ సినిమా చేసింది. మంచి నటి అనిపించుకోవాలని కష్టపడి పని చేస్తుంది. అంజలి తెలుగు ఇండస్ట్రీకు దేవుడిచ్చిన వరప్రసాదం లాంటిది. అందరం కష్టపడి పని చేశాం. 'డిక్టేటర్' అంటే నియంత అని అర్ధం. నా స్వభావానికి దగ్గరగా ఉన్న టైటిల్ ఇది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికి నచ్చే చిత్రమవుతుంది'' అని చెప్పారు.

ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ.. ''బాలయ్య గారి 99వ సినిమా ఆడియో వేడుక అమరావతిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. చలనచిత్ర పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాలి. బాలకృష్ణ గారు వందో సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి ఇప్పటినుండే శుబాకాంక్షలు తెలుపుతున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. ''లౌక్యం సినిమా తరువాత బాలయ్య గారితో కలిసి సినిమా చేయాలని వెళ్లి కలిసాను. ఆయన వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు. కొత్త రాజధానిలో మొదట ఆడియో వేడుక 'డిక్టేటర్' జరుగుతుందంటే దానికి కారణం బాలకృష్ణ గారే. నన్ను నమ్మి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. బాలయ్య గారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆయనతో చేసిన జర్నీ మర్చిపోలేను. నన్ను ఇంట్లో మనిషిలా చూశారు. టెక్నీషియన్స్ అంతా బాగా సపోర్ట్ చేసారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ.. ''బాలయ్య గారు నటించిన 'బైరవధ్వీపం' సినిమాతో కెరీర్ మొదలు పెట్టాను. ఆయన 99 వ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. బాలయ్య గారికి ఉన్న ఎనర్జీకి రీరికార్డింగ్ చేయడం చాలా కష్టం. నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ అందించారు. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

అంజలి మాట్లాడుతూ.. ''బాలకృష్ణ గారితో సినిమా చేయాలని తెలిసినప్పుడు చాలా భయపడ్డాను. కాని ఆయన చాలా మంచి వ్యక్తి. తమన్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, శ్రీవాస్ గారి డైరెక్షన్ సినిమాకు హైలైట్స్ గా నిలుస్తాయి'' అని చెప్పారు.

మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ''బాలయ్య గారి సినిమా ఆడియో వేడుక జరుపుకోవడం రాజధానికి శుభారంభం. ఈ చిత్రం సంచలనాలను సృష్టించడమే కాకుండా 2016లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది'' అని చెప్పారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. '' 'డిక్టేటర్' అనే టైటిల్ తో ఇండియాలో సినిమా చేయగలిగే ఒకే ఒక్క నటుడు బాలయ్య బాబు. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సోనాల్ చౌహాన్, అంభిక కృష్ణ, రామజోగయ్య శాస్త్రి, రఘుబాబు, శ్యాం.కె.నాయుడు, సాయి కొర్రపాటి, పూర్ణ చంద్రరావు, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్, ఎడిటర్: గౌతంరాజు, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, ప్రొడ్యూసర్: ఎరోస్ ఇంటర్నేషనల్, కో-ప్రొడ్యూసర్: వేదాస్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్.    

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement