Advertisement

అశ్విన్ డాన్స్ నాకు ఇష్టం: రాజమౌళి!

Mon 14th Dec 2015 01:16 PM
jathakalise movie audio launch,ashwin babu,rakesh shasi,naresh ravuri  అశ్విన్ డాన్స్ నాకు ఇష్టం: రాజమౌళి!
అశ్విన్ డాన్స్ నాకు ఇష్టం: రాజమౌళి!
Advertisement

అశ్విన్ బాబు, తేజస్విని జంటగా ఓక్ ఎంటర్టైన్మెంట్స్, యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై రాకేష్ శశి దర్శకత్వంలో నరేష్ రావూరి నిర్మిస్తోన్న చిత్రం 'జత కలిసే'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. రాజమౌళి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను ఎం.ఎం.కీరవాణి కు అందించారు. థియేట్రికల్ ట్రైలర్ ను కీరవాణి రిలీజ్ చేశారు. ఇదే కార్యక్రమంలో 'రాజుగారిగది' యాభై రోజుల వేడుకలను నిర్వహించారు. 

ఈ సందర్భంగా..

రాజమౌళి మాట్లాడుతూ.. ''ఆడియో ఫంక్షన్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. అలానే సినిమా కూడా ఉంటుందని భావిస్తున్నాను. అశ్విన్ డాన్స్ బాగా చేసాడు. 'రాజుగారిగది' సినిమాలో అశ్విన్ వేసిన ఒక స్టెప్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. డైరెక్టర్ బాగా తీశారు. స్నేహం కోసం ఫ్రెండ్ ను నమ్మి నిర్మాత సినిమా చేశారు. సాయి కొర్రపాటి గారు ఇలానే మంచి సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలి'' అని చెప్పారు. 

ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.. ''సినిమా ఇండస్ట్రీ పెద్ద భవనం లాంటిది. అందులో చిన్న గదులు, పెద్ద గదులు చాలా ఉంటాయి. అందరికంటే పెద్ద గది ప్రొడ్యూసర్ గారిది. ఆయన రాజు లాంటి వాడు. గతంలో వచ్చిన 'హ్యాపీడేస్' అనే చిన్న చిత్రం దిల్ రాజు సహకారంతో పెద్ద చిత్రంగా రిలీజ్ అయింది. చిన్న బడ్జెట్ సినిమాలకు పెద్ద ప్రొడ్యూసర్ల సపోర్ట్ ఉంటే మంచిది. ఈ చిత్రానికి సాయి కొర్రపాటి గారి సపోర్ట్ ఉంది. సాంగ్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి'' అని చెప్పారు.

అశ్విన్ బాబు మాట్లాడుతూ.. ''రాజుగారిగది తో ఆడియన్స్ నాకు లైఫ్ ఇచ్చారు. ఇది నా మూడవ సినిమా. మా అన్నయ్య లేకపోతే నేను లేను. తన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది. విక్కీ, సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్, నిర్మాతలకే కాదు హీరోగా కూడా నాకు ఇదే మొదటి సినిమా. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ.. ''తొమ్మిది సంవత్సరాల క్రితం ఎవరు తెలియకపోయినా సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను. నా మొదటి సినిమా వారాహి సంస్థ ద్వారా రిలీజ్ అవ్వడం అద్రుష్టంగా భావిస్తున్నాను. స్నేహం కోసం నన్ను నమ్మి నరేష్ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సినిమా తీశాడు. తన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి. ఓంకార్ గారు ఎంతగానో హెల్ప్ చేసారు. సరదాగా సాగిపోయే ఓ జర్నీ కథే ఈ సినిమా. విక్కీ, సాయి కార్తీక్ లు పెర్ఫెక్ట్ ట్యూన్స్ ఇచ్చారు. సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

ఓంకార్ మాట్లాడుతూ.. ''తమ్ముడిని హీరోగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నం 'రాజుగారిగది' సినిమా. నేటికి ఆ చిత్రం యాబై రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అనిల్ సుంకర, సాయి కొర్రపాటిల సపోర్ట్ తోనే ఇది సాధ్యమైంది. అనిల్ సుంకర గారి బ్యానర్ లో తమ్ముడిని హీరోగా పెట్టి 'జతకలిసే' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ''రాజుగారిగది' సినిమాతో హిట్ లిస్టు లోకి చేరిన అశ్విన్ 'జత కలిసే' చిత్రంతో స్టార్స్ లిస్టు లోకి చేరాలి. అధ్బుతమైన నటుడు. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

నిర్మాత నరేష్ మాట్లాడుతూ.. ''రాజమౌళి గారి చేతుల మీదుగా ఆడియో లాంచ్ అవ్వడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. ''చిన్న చిత్రంగా మొదలయిన 'జత కలిసే' పెద్ద చిత్రంగా విడుదలవుతోంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

తారక రత్న మాట్లాడుతూ.. ''ఈ కార్యక్రమం ఫ్యామిలీ ఫంక్షన్ లా ఉంది. 'రాజుగారిగది' చిత్రంలానే 'జత కలిసే' కూడా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ.. ''పాజిటివ్ వైబ్స్ తో విడుదలయిన 'రాజుగారిగది' పెద్ద హిట్ అయింది. 'జత కలిసే' సినిమా చూసాను. ఈ సంవత్సరంలో బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. నిర్మాతకు, డైరెక్టర్ కు సినిమా మంచి పేరు తీసుకురావాలి'' అని చెప్పారు.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''సినిమా చూశాను. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. తేజశ్విని మంచి నటి. టీం అందరికి ఆల్ బెస్ట్'' అని అన్నారు.

విక్కీ మాట్లాడుతూ.. ''సినిమాలో మొత్తం నాలుగు పాటలున్నాయి. మూడు పాటలను నేను కంపోజ్ చేసాను. నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో తేజశ్విని, శ్రీవాస్, స్నిగ్ద, విధ్యులేక రామన్, అనంతశ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement