Advertisement

'శ్రీ శ్రీ' ఎవరో తెలుసా..?

Wed 09th Dec 2015 06:06 PM
sree sree movie press meet,super star krishna,vijayanirmala,muppalaneni siva  'శ్రీ శ్రీ' ఎవరో తెలుసా..?
'శ్రీ శ్రీ' ఎవరో తెలుసా..?
Advertisement

సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీ శ్రీ'. ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ''శ్రీ శ్రీ అనే టైటిల్ వింటుంటే మహాకవి శ్రీ శ్రీ గుర్తొస్తున్నాడు. ఆ మహాకవి తన ఆవేశాన్ని రాతల్లో చూపిస్తే.. మా శ్రీ శ్రీ తన ఆవేశాన్ని చేతల్లో చూపిస్తాడు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముప్పలనేని శివ చెప్పినదానికంటే ఇంకా బాగా తీస్తున్నాడు. ఇప్పటికే 75% షూటింగ్ పూర్తయ్యింది. గ్రాఫిక్స్ మిగిలిన షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు'' అని చెప్పారు.

విజయనిర్మల మాట్లాడుతూ.. ''సినిమా కథ నచ్చింది. మా పాత్రలు కూడా నచ్చడంతో కృష్ణ గారు, నేను కలిసి నటిస్తున్నాం. డెబ్బై సంవత్సరంలో రీఎంట్రీ ఇస్తున్నాను. ఇలాంటి పాత్రలు వస్తే మరిన్ని చిత్రాల్లో నటించాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

నటుడు నరేష్ మాట్లాడుతూ.. ''తెలుగు సినిమాకు భారతీయ సినిమాకు గొప్ప ఘనత తెచ్చిపెట్టిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్రతి దశాబ్దంలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సామాజిక స్ఫూర్తి ఉన్న వ్యక్తి. మరాఠీలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ ఫిలిం. ఈ సినిమాలో నేనొక కీ రోల్ పోషిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు ఈ సినిమా పెద్ద ట్రీట్ అవుతుంది'' అని చెప్పారు.

ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ''1994లో ఘరానా అల్లుడు చిత్రం ద్వారా నేను దర్శకునిగా మారడానికి ఎంతగానో సహకరించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనంటే నాకు ప్రాణం. 50 సంవత్సరాల వేడుకల్లో ఆయనకు గుర్తుండిపోయే విధంగా ఉండాలని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. అలనాటి శ్రీ శ్రీ గారి భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే ఎలా ఉంటుందో.. అనేదే ఈ సినిమా. కృష్ణ గారు ఈ చిత్రంలో ఇమిడిపోయి నటించారు. జనవరి 25నాటికి మొదటి కాపీ రెడీ చేసి ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. మంచి ఆర్టిస్టులు కుదిరారు'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''ఇది మా మొదటి ప్రొడక్షన్. కృష్ణ లాంటి లెజండరీ యాక్టర్ తో పని చేయడం మా అద్రుష్టంగా భావిస్తున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కథ: రమేష్ డిఓ ప్రొడక్షన్స్, డైలాగ్స్: రామ్ కంకిపాటి, మ్యూజిక్: ఇ.ఎస్.మూర్తి, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ డైరెక్టర్: అశోక్, ఎడిటర్: రమేష్, కాన్సెప్ట్ రైటర్: కళ్యాన్ జీ, కో డైరెక్టర్: రమేష్ రాజా.ఎం, ఫైట్స్: నందు, అసోసియేట్ డైరెక్టర్: విజయ భాస్కర్ కైలాసపు, నిమ్మకాయల కోటి, అసిస్టెంట్ డైరెక్టర్: శ్రీ రామ్, కాస్ట్యూమ్స్: రమేష్, సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: తాండవ కృష్ణ, నారాయణ, ప్రొడక్షన్ మేనేజర్: కె.మల్లిక్, నిర్మాతలు: శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్, దర్శకత్వం: ముప్పలనేని శివ.     

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement