Advertisement

'అబ్బాయితో అమ్మాయి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

Tue 08th Dec 2015 11:01 PM
abbayitho ammayi release date,nagasowrya,ramesh varma  'అబ్బాయితో అమ్మాయి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్!
'అబ్బాయితో అమ్మాయి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్!
Advertisement

నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

మల్టీడైమెన్షన్ వాసు మాట్లాడుతూ.. ''తొమ్మిది నెలలుగా ఈ సినిమా కోసం పని చేసాం. రీసెంట్ గా విడుదలయిన సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇళయరాజా గారు సినిమా రీరికార్డింగ్ చేసినప్పుడు సినిమా బాగా వచ్చిందని, ఇటువంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులయ్యిందని చెప్పారు. క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డాం. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. డిసెంబర్ 24న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''టాప్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా ఇంటి మనిషి నాగశౌర్య నటిస్తోన్న సినిమా గనుక గ్రాండియర్ గా తీయాలని భావించాం. ఇళయరాజా గారు ఈ సినిమా తెలుగుకే పరిమితం చేయకుండా తమిళంలో కూడా రిలీజ్ చేయమని చెప్పారు. ఆ విషయం గురించి సి.కళ్యాణ్ గారితో మాట్లాడాం. ఆయన తమిళంలో రిలీజ్ చేయడానికి ఓకే చెప్పారు. సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం'' అని చెప్పారు.

నాగశౌర్య మాట్లాడుతూ.. ''సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. మంచి ప్రాజెక్ట్. సినిమా చూసిన వారంతా బావుందని చెబుతున్నారు. ఎంతో ఖర్చుపెట్టి సినిమా తీసారు. ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. పాలక్ చాలా బాగా నటించింది. ఇళయరాజా గారు మ్యూజిక్ అందించిన చిత్రంలో నేను నటించడం అద్రుష్టంగా భావిస్తున్నాను'' అని చెప్పారు.

రమేష్ వర్మ మాట్లాడుతూ.. ''అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ లో సినిమా నిర్మించాం. అందరూ బాగా సపోర్ట్ చేసారు. క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

పాలక్ అల్వాని మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. షూటింగ్ టైం లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను'' అని చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యాం కె నాయుడు, మ్యూజిక్: ఇళయరాజా, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, లిరిక్స్: రెహ్మాన్, యాక్షన్: వెంకట్ శ్రీను, నిర్మాతలు: వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్, దర్శకత్వం: రమేష్ వర్మ.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement