Advertisement

మరో మహాపర్వానికి తెర లేవబోతోంది!

Thu 03rd Dec 2015 10:30 AM
robot 2,rajinikanth,shankar,december 12  మరో మహాపర్వానికి తెర లేవబోతోంది!
మరో మహాపర్వానికి తెర లేవబోతోంది!
Advertisement

ఇండియన్ స్క్రీన్ మీద శంకర్, రజినీకాంత్ చేసిన రోబో ఓ కొత్త పర్వంగా లిఖించబడింది. యావత్ ప్రపంచంలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడింది. అటు తరువాత మళ్ళీ రజిని, శంకర్ కలయిక అనేసరికి హాలివుడ్ కూడా ఓ సారి ఉలిక్కిపడి ఇండియన్ సినిమా వైపు చూస్తోంది. అసలు దక్షిణాదిలో వందకోట్ల బడ్జెట్ చిత్రాలకు ఊతమిచ్చిందే రోబో. మరి అతిత్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతోంది అంటూ ఊదరగొడుతున్న ప్రచారం ఇప్పుడు నిజం కానుంది. అమెరికాకు చెందిన లైకా ప్రొడక్షన్స్ వారు రోబో 2ని మునుపెన్నడూ ఇండియన్ సినిమా చూడని అత్యంత భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రోబో 2 ప్రీ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తూ దర్శకుడు శంకర్ కొంత కాలంగా బిజీగా వుంటున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాను రజనీకాంత్ పుట్టిన రోజు, అదే ఈ నెల 12న లాంఛనంగా ప్రారంభించనున్నారని, అదే నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. కబాలి షూటింగ్ పూర్తయిన తరువాత రజినీకాంత్ పూర్తి సమయం రోబో 2కే కేటాయించనున్నారు. ఈ ఏడాది ఆఖర్లో రానున్న మరో మహాపర్వానికి రోబో 2 తెర తీయనుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement