Advertisementt

వీరప్పన్ మంచోడైతే గాంధీ సంగతేంటి:వర్మ!

Tue 01st Dec 2015 12:37 PM
ram gopal varma,veerappan wife mutthulakshmi,killing veerappan movie  వీరప్పన్ మంచోడైతే గాంధీ సంగతేంటి:వర్మ!
వీరప్పన్ మంచోడైతే గాంధీ సంగతేంటి:వర్మ!
Advertisement
Ads by CJ

రామ్ గోపాల్ వర్మ  చిత్రం ''కిల్లింగ్ వీరప్పన్'' రిలీజ్ ఆపేయ్యాలని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పెట్టిన కేసు కి సంబంధించి ముత్తులక్ష్మి తన నోటీసులో పేర్కొన్న ముఖ్య కారణాలు.

1.లంచగొండి ప్రభుత్వం, నయవంచక ఆటవిక అధికారుల నుండి అడవులని సంరక్షించడానికి తన జీవితాన్ని ధారపోసిన వీరప్పన్ ని ఈ చిత్రంలో చెడ్డవాడిగా చూపబోతున్నారు.

2.చాలా మంది తమిళులు వీరప్పన్ ని దైవ సమానుడిగా భావిస్తారు.

3.ఈ చిత్రంలో వీరప్పన్ ని చూపించే విధానాన్ని బట్టి రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి.

4.నాకు తెలిసిన సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డు కూడా రామ్ గోపాల్ వర్మ తో చేతులు కలిపి నా భర్త కీర్తి ప్రతిష్టలను పాడు చెయ్యడానికి సిద్ధమవుతోంది.

ఈ కారణాల పట్ల రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సమాధానం: 

''ప్రతి బిడ్డ తన తల్లికి ముద్దొచ్చినట్టుగానే,ప్రతి భార్య తన భర్త మంచివాడనుకుంటుంది...ఒసామా బిన్  లాడెన్ భార్య ప్రకారం కూడా తన  భర్త కన్నా మంచివాడు ప్రపంచంలోనే లేడు..ఇప్పుడు నా ప్రశ్నేంటంటే..  ఒసామా బిన్ లాడెన్,వీరప్పన్ కూడా మంచి వాళ్ళే అయితే మరి మహాత్మా గాంధీ గారి సంగతేంటి?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ