Advertisement

ఎన్టీఆర్ కి పోటీగా మోహన్ లాల్!

Fri 27th Nov 2015 03:29 PM
jr ntr,koratala siva,mohan lal,srimanthudu movie,mohan lal in jr ntr and koratala siva movie  ఎన్టీఆర్ కి పోటీగా మోహన్ లాల్!
ఎన్టీఆర్ కి పోటీగా మోహన్ లాల్!
Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఒక భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. అక్టోబర్ 25 న ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగింది. 2016 తొలినాళ్ళలో షూటింగ్ ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ తో ఇప్పటికే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు మరొక స్టార్ అట్రాక్షన్ తోడయ్యింది. సుప్రసిద్ధ మలయాళ నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ మోహన్ లాల్ గారు ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ తో పోటాపోటీ గా సాగే ఈ క్యారెక్టర్ గురించి వినగానే మోహన్ లాల్ గారు చాలా ఎక్సైట్ అయ్యి వెంటనే ఒకే చేసారు. 

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. ఇటువంటి భారీ ప్రాజెక్ట్ లో మోహన్ లాల్ గారు కూడా ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇద్దరు అద్భుతమైన నటులు కలిసి పండించే సీన్స్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. వీరిద్దరి కాంబినేషన్ ఈ చిత్రానికి ఒక స్పెషల్ హైలైట్ అవుతుంది. 

ఈ చిత్రానికి సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తారు. కెమెరామాన్ గా ఎన్నో ప్రశంశలను అందుకున్న తిరు గారు పని చేస్తారు. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్ లు ఉంటారు. ఈ వివరాలను త్వరలో తెలియజేస్తాం. 

చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాల గా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా అయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను. వచ్చే ఏడాది తొలి మాసాల లో షూటింగ్ ను ప్రారంభించి, ఆగస్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.  

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ :

మంచి చిత్రాలను ఉత్తమ సాంకేతిక విలువలతో ప్రేక్షకులకు అందించాలనే ఆశయం తో మైత్రీ మూవీస్ సంస్థ ను ప్రారంభించాం. మా రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో తో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మా బ్యానర్ లో మొదటి చిత్రం అయిన 'శ్రీమంతుడు' ని బ్లాక్బస్టర్ గా తీర్చిదిద్దిన మా డైరెక్టర్ కొరటాల శివ గారితో మళ్లీ పనిచేయటం చాలా సంతోషం గా ఉంది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని భారీ వ్యయం తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం.  2016 తొలి మాసం లో  షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 12న, కృష్ణా పుష్కరాల సందర్భం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు   . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్  నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.)  కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ. Executive Producer-  చంద్రశేఖర్ రావిపాటి

ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement