Advertisement

'రాజుగారింట్లో 7వ రోజు' పాటలు విడుదల!

Sat 21st Nov 2015 02:33 PM
raju garintlo yedava roju audio launch,feroz raja,bharath,kanishka  'రాజుగారింట్లో 7వ రోజు' పాటలు విడుదల!
'రాజుగారింట్లో 7వ రోజు' పాటలు విడుదల!
Advertisement

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మిస్తున్న సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. కనిష్క్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌ సీడీను ఆవిష్కరించగా, ఆడియో సీడీలను హీరో తరుణ్‌ విడుదల చేసి తొలి సీడీని తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ''సినిమా ట్రైలర్, పాటలు బావున్నాయి. ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే కోణంలో ఇటీవల విడుదలయిన రాజుగారి గది పెద్ద సక్సెస్ అయింది. అలానే ఈ సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించాలి. కనిష్క్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు'' అని చెప్పారు. 

హీరో తరుణ్‌ మాట్లాడుతూ.. ''రాజుగారి గది కంటే ఈ సినిమా 7రెట్లు పెద్ద విజయాన్ని సాధించాలి. ఈ బ్యానర్ లో మరిన్ని మంచి సినిమాలు రావాలి. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. కనిష్క్‌ మ్యూజిక్ బావుంది. ఈ సినిమా అందరికి మంచి పేరు తీసుకురావాలి'' అని అన్నారు. 

దర్శకుడు ఫిరోజ్‌ రాజ మాట్లాడుతూ.. ''అందరి జీవితాలలో జరిగే సంఘటనలే ఈ కథ. హారర్, కామెడి, థ్రిల్లర్‌ అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది. కనిష్క్‌ నాలుగు అద్భుతమైన సాంగ్స్‌ను, రీరికార్డింగ్‌ను అందించారు. భరత్ నిర్మాతగానే కాకుండా.. మంచి పాత్రలో నటించారు'' అని అన్నారు. 

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ.. ''హారర్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన చిత్రమిది. ఫిరోజ్‌ రాజ సినిమాను చక్కగా డైరెక్ట్‌ చేశారు. కనిష్క్‌ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకు ప్రతి ఒక్కరు ఎంతగానో సహకరించారు. అందరికి నా ధన్యవాదాలు'' అని చెప్పారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌ కనిష్క్‌ మాట్లాడుతూ.. ''హీరో తరుణ్‌ గారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో మాదాల రవి, సాయివెంకట్‌, రామసత్యనారాయణ, చిన్నా, భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, ఎడిటర్: అనిల్, స్టిల్స్: నాగభూషణం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement