Advertisement

'చిరు గొడవలు' రెడీ ఫర్ రిలీజ్!

Tue 17th Nov 2015 05:51 PM
trikaran reddy interview,chiru godavalu movie,jaipal yeleti  'చిరు గొడవలు' రెడీ ఫర్ రిలీజ్!
'చిరు గొడవలు' రెడీ ఫర్ రిలీజ్!
Advertisement

రోహిత్, భావిక, సిద్ధార్థ్, రాగ, నాగేంద్ర, హారిక, యోధ, గీతాంజలి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'చిరు గొడవలు'. 11 ప్లస్ మూవీస్ బ్యానర్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ ఫిలిం స్కూల్ విద్యార్థులు ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రికరణ్ రెడ్డి దర్శకుడు. జైపాల్ ఏలేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. 

దర్శకుడు త్రికరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ''అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో గ్రాడ్యుయేట్స్ అయిన 11 మంది ఓ గ్రూప్ గా కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మొదట ట్రైలర్ బేసిస్ మీద ఈ చిత్రాన్ని తీశాం. కాని సినిమా చూసిన తరువాత రిలీజ్ చేయాలని భావించాం. సినిమా అంత బాగా వచ్చింది. నాలుగు జంటల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటుంది. కాస్టింగ్ ఓకే అయితే డైరెక్ట్ చేయడం సులువైన పని. అయితే ఈ సినిమా కోసం నాకు ఇంటర్మీడియట్ వయస్సు గల అమ్మాయిలు, అబ్బాయిలు కావాలి. సుమారుగా ఐదు నెలల పాటు కాస్టింగ్ కోసం సెర్చ్ చేశాం. కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందరూ కొత్త వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు. ఫైనల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ వారే రెండు రాష్ట్రాల్లో కలిపి 45 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. గంట యాబై నిమిషాల నిడివి గల ఈ సినిమాలో రెండు పాటలుంటాయి'' అని చెప్పారు.

రోహిత్, భావిక, సిద్ధార్థ్, రాగ, నాగేంద్ర, హారిక, యోధ, గీతాంజలి, శ్రావణ్ రాఘవ, సుదర్శన్ రెడ్డి, సంధ్య జనక్, బీను మల్హోత్రా, బేబి సమీర్ణ, బేబి హన్సిక నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమీ, సంగీతం: గీతా పూనిక్, నిర్మాత: జైపాల్ ఏలేటి, దర్శకత్వం: త్రికరణ్ రెడ్డి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement