Advertisementt

సంక్రాంతికే 'నాన్నకు ప్రేమతో'!

Wed 11th Nov 2015 09:00 PM
nannaku prematho,jr ntr,nannaku prematho movie,sankranthi,diwali  సంక్రాంతికే 'నాన్నకు ప్రేమతో'!
సంక్రాంతికే 'నాన్నకు ప్రేమతో'!
Advertisement
Ads by CJ

నవంబర్‌ 19 నుండి స్పెయిన్‌లో ఎన్టీఆర్‌-సుకుమార్‌-బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ల 'నాన్నకు ప్రేమతో..' 

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ దసరా కానుకగా విడుదల చేశారు. ఈ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది.  దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. 

సంక్రాంతి కానుకగా 'నాన్నకు ప్రేమతో..' 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - "విజయదశమి కానుకగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ వచ్చింది.  దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తున్నాం. లండన్‌లో ఈ చిత్రానికి సంబంధించి 60 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో తీసిన సీన్స్‌ అన్నీ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. నవంబర్‌ 19 నుంచి స్పెయిన్‌లో 20 రోజులపాటు చివరి షెడ్యూల్‌ జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా మా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం" అన్నారు. 

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ