Advertisement

బంగారు పాదం సినిమా విశేషాలు!

Sat 07th Nov 2015 07:52 PM
bangaru padam movie press meet,prasad,josyabhatla  బంగారు పాదం సినిమా విశేషాలు!
బంగారు పాదం సినిమా విశేషాలు!
Advertisement

దయా, జ్యోతిశ్రీ ప్రధాన పాత్రల్లో ఎన్.హెచ్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'బంగారు పాదం'. ఈ సినిమా విశేషాలు తెలిపేందుకు చిత్ర బృందం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

దర్శకనిర్మాత ఎన్.హెచ్.ప్రసాద్ మాట్లాడుతూ.. ''దర్శకత్వంలో మూడు సంవత్సరాలు కోర్సు చేసాను. కొన్ని కారణాల వలన సినిమా డైరెక్ట్ చేయడం కుదరలేదు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. వస్తువులకు, మనుషులకు ఉన్న సంబంధాలను ఈ సినిమాలో చూపించాం. కాలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఒంటరిగా తన జీవితాన్ని ఎలా గడిపాడనేదే ఈ సినిమా కథ. భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ అందరికి కనెక్ట్ అవుతుంది. క్రియేటివ్ టీం కుదిరింది'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ జోశ్యభట్ల మాట్లాడుతూ.. ''మిణుగురులు చిత్రం తరువాత ఆ తరహాలో ఉండే ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాను. ఓ వ్యక్తి జీవితానికి సంబంధించిన చిత్రమిది. ఇదొక పరిపూర్ణమైన సినిమా అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీను బాబు, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయిర్, మ్యూజిక్ డైరెక్టర్: జోశ్యభట్ల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవి కుమార్, కథ-మాటలు-దర్శకత్వం-నిర్మాత: ఎన్.హెచ్.ప్రసాద్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement