Advertisement

కంచెపై చిరు స్పందన!

Sun 25th Oct 2015 10:11 AM
kanche movie,varun tej,krish,chiranjeevi,sai madhav burra  కంచెపై చిరు స్పందన!
కంచెపై చిరు స్పందన!
Advertisement

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన చిత్రం కంచె. అక్టోబర్ 22 న దసరా కానుకగా విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలానే ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయిన మెగాస్టార్ చిరంజీవి కంచె టీమ్ ను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి అభినందించారు. ఈ సందర్భంగా..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కంచె సినిమా చూసిన తరువాత చిత్రబృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. ఇది ప్రయోగాత్మక చిత్రం కాదు. విజయవంతమైన ప్రయత్నం అని చెప్పాలి. ఓ యువకుడి యొక్క జీవితాన్ని అతని వృత్తిని మంచి కథనంతో తెరకెక్కించారు. పల్లెటూరి వాతావరణాన్ని, ప్రేమకథను చక్కని నేటివిటీతో చెప్పారు. వార్ ఎపిసోడ్ అయితే డైరెక్టర్ క్రిష్ హాలీవుడ్ స్థాయిలో తీసారు. తెలుగు పరిశ్రమలో ఇలాంటి సినిమా రావడం గర్వకారణం. వరుణ్ అయితే తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సినిమాలో తనను చూస్తుంటే నిజంగానే 1930 లకు చెందిన యువకుడిలానే కనిపించాడు. యుద్ధ సన్నివేశాలు, పల్లెటూరి సన్నివేశాల్లో అధ్బుతంగా నటించాడు. ఓ తండ్రిగా వరుణ్ ను చూసి చాలా ఆనందంగా అనిపించింది. సాయి మాధవ్ డైలాగ్స్ క్రిస్పీ గా ఉన్నాయి. ఫిలాసిఫికల్ డైలాగ్, కులాల మీద వచ్చే డైలాగ్ అందరిని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. పనిబట్టి కులాలు వచ్చాయి కాని కులాలనేవి లేవని బాగా చెప్పారు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా నేను సినిమా చూసాను. నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. 200, 300 రోజులని అడ్డుగీత పెట్టుకోకుండా బడ్జెట్ పెరిగిపోతున్నా.. పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాతావరణంలో క్రిష్ జార్జియాలో వార్ ఎపిసోడ్స్ షూట్ చేసి మొత్తం 55 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసాడు. దర్శకుడి ప్రతిభకు గీటురాయి ఇది. కంచె మంచి కమర్షియల్ సినిమా అనుకోవాలే తప్ప ప్రయోగాత్మక సినిమా అనుకోకూడదు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement