Advertisement

శంకరాభరణం తర్వాత నిఖిల్‌ చిత్రం ఇదే!

Thu 22nd Oct 2015 09:29 PM
nikhil,sankarabharanam,nikhil new movie with vi anand,vijay kamishetty,tiger movie,nikhil and vi anand movie details  శంకరాభరణం తర్వాత నిఖిల్‌ చిత్రం ఇదే!
శంకరాభరణం తర్వాత నిఖిల్‌ చిత్రం ఇదే!
Advertisement

న్యూ జనరేషన్‌కు నచ్చే సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్‌ సూర్య వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ సొంతం చేసుకొని.. యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్న నిఖిల్‌ సిద్దార్థ్..  శంకరాభరణం  అనంతరం నటించే  చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం మేఘన ఆర్ట్స్‌ పతాకంపై పి.వెంకటేశ్వర్రావు తన మొదటి చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి.. టైగర్‌ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తన ప్రతిభను ఘనంగా చాటుకున్న యువ ప్రతిభాశాలి వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

విజయదశమి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంబమైన ఈ చిత్రం నవంబర్ లో  సెట్స్ పైకి  వెళ్లనుంది.. ఈ చిత్రం టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నారు  

చిత్ర నిర్మాత-మేఘన ఆర్ట్స్‌ అధినేత పి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. టైగర్ చిత్రంతో విజయం సాధించి, స్క్రీన్ ప్లే పరంగా  కొత్తదనాన్ని ఆవిష్కరించిన  వి.ఐ.ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తనదైన శైలిలో సరికొత్త కధలని ఎంచుకునే హీరో నిఖిల్‌ ఈ కధని సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకె చేసారు. సాయిశ్రీరాం, అబ్బూరి రవి, శేఖర్‌చంద్ర, చోటా కే ప్రసాద్ వంటి సక్సెస్ ఫుల్ టేక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటుల ఎంపిక పూర్తి చేసి.. నవంబర్‌ చివరిలో సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు. 

ఈ చిత్రానికి ఛీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌: విజయ్‌ కామిశెట్టి, కో-డైరెక్టర్‌: వరప్రసాద్‌ వరికూటి, ఆర్ట్‌: ఎ.రామాంజనేయులు, ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సాయిశ్రీరాం, సహ నిర్మాత: డి.శ్రీనివాస్‌, నిర్మాత: పి.వెంకటేశ్వర్రావు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement