Advertisementt

జంక్షన్ లో జయమాలిని చిత్రం ప్రారంభం!

Thu 22nd Oct 2015 09:01 PM
junction lo jayamalini movie,sayyed allabakshu,sivanagu  జంక్షన్ లో జయమాలిని చిత్రం ప్రారంభం!
జంక్షన్ లో జయమాలిని చిత్రం ప్రారంభం!
Advertisement
Ads by CJ

మనీషా సింగ్, అనుకృతి శర్మ, మహబూబ్ మన్సూర్ ప్రధానపాత్రల్లో విజయసారధి విజువల్స్, విజయసారధి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సయ్యద్.అల్లాబక్షు నిర్మిస్తున్న చిత్రం జంక్షన్ లో జయమాలిని. శివనాగు దర్శకుడు. ఈ చిత్రం ప్రారభోత్సవ వేడుక గురువారం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వినాయక్ రావు క్లాప్ కొట్టగా, వై.అశోక్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కె.ఎస్.నాగేశ్వరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

శివనాగు మాట్లాడుతూ.. ఇరవై సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ చిత్రంలో మనీషా సింగ్ టైటిల్ రోల్ పోషిస్తుంది. ఈ నెల 26 వరకు సినిమా షూటింగ్ జరిపిన తరువాత నవంబర్ 5వ తేదీ నుండి అమలాపురంలో ఏకధాటిగా షూటింగ్ నిర్వహించి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

సయ్యద్.అల్లాబక్షు మాట్లాడుతూ.. కొన్ని చిత్రాలకు ఫైనాన్షియర్ గా పని చేసాను. ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ గా మారాను. శివనాగు గారు మంచి లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ చెప్పారు. విభిన్నమైన కథనంతో సినిమా ఉంటుంది. ఐదు పాటలుంటాయి. మంచి టీం కుదిరింది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

మనీషా సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో సెన్సిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. హిందీలో, పంజాబిలో లో కొన్ని సినిమాల్లో నటించాను. తెలుగులో ఇది మొదటి సినిమా. నాకు ఈ అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అని చెప్పారు.

అనుకృతి మాట్లాడుతూ.. స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ తీసుకొని సినిమా చేయడం సంతోషంగా ఉంది. మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: శివనాగు, మాటలు: అమరేశ్వరావు, కోరియోగ్రఫీ: అభినయశ్రీ, నిర్మాత: సయ్యద్. అల్లాబక్షు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ