Advertisement

వందనం సినిమా ఆడియో విడుదల!

Sun 11th Oct 2015 06:21 AM
vandanam movie audio launch,deepak saroj,kotapati sreenu  వందనం సినిమా ఆడియో విడుదల!
వందనం సినిమా ఆడియో విడుదల!
Advertisement

దీపక్ సరోజ్, మాళవిక మీనన్ జంటగా కందిమళ్ళ మూవీ మేకర్స్ పతాకంపై కోటపాటి శ్రీను దర్శకత్వంలో కందిమళ్ళ వెంకట చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం వందనం. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన టి.సుబ్బిరామిరెడ్డి బిగ్ సీడీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..

సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది గొప్పలకు పోయి అనవసరమైన ఖర్చు చేస్తారు. కాని ఈ నిర్మాత చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాడు. ఇండస్ట్రీలో మంచి క్వాలిటీ సినిమాలు రావాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. సినిమా హీరో దీపక్ తల్లితండ్రులు రాజకీయాల్లో మంచి స్థాయిలో ఉన్నారు. దీపక్ కు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

జయప్రద మాట్లాడుతూ.. వందనం ట్రైలర్ బావుంది. సాంగ్స్ చాలా బావున్నాయి. ప్రేమకథలపై ఎన్ని చిత్రాలొచ్చినా మరిన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. దీపక్ కు ఉన్న ఇంట్రెస్ట్ ను గమనించి తనను ప్రోత్సహించిన పేరెంట్స్ ను అభినందిస్తున్నాను. అలా అని దీపక్ చదువును పక్కన పెట్టలేదు. చిన్న బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

ఎం.ఎల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ.. దీపక్ బాలనటునిగా మా సంస్థలోనే చేసాడు. తను నటించిన పెదబాబు వందరోజులు ఆడింది. ఆంధ్రుడు సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమాలో పాటలు, ట్రైలర్ బావున్నాయి. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

సుమన్ మాట్లాడుతూ.. సినిమా కథ చాలా బావుంటుంది. నేను కూడా ఇందులో నటించాల్సివుంది కాని కుదరలేదు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. ఖచ్చితంగా హిట్ అవుతుంది.. అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ జె.పి మాట్లాడుతూ.. ఇదొక మంచి లవ్ స్టొరీ. రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. అని చెప్పారు. 

అయోధ్య కుమార్ మాట్లాడుతూ.. దీపక్ మా మిణుగురులు సినిమాలో నటించడానికి సుమారుగా 35 కిలోలు తగ్గాడు. చాలా డెడికేషన్ ఉన్న పెర్సన్. తనకు ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలి.. అని చెప్పారు. మనోజ్ మాట్లాడుతూ.. దీపక్ నాకు జూనియర్. మేమిద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం. తను హీరోగా నటిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి.. అని చెప్పారు.

దీపక్ మాట్లాడుతూ.. సత్యానంద్ గారి దగ్గర మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయింది నేనే. సుమారుగా 45 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసాను. నేనేం సినిమాలు చేసాను అని ఎవరైనా అడిగిదే లెజెండ్, మిణుగురులు అని చెప్తాను. ఆ రెండు చిత్రాలు నాకు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. ఈ సినిమా లెజెండ్ కు సీక్వెల్ గా ఉంటుంది.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, డి.ఎస్.రావు, దామోదరప్రసాద్, రవికిరణ్, మాళవిక, మల్కాప్పురం శివకుమార్, తాగుబోతు రమేష్, జోశ్య భట్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు: స్వర్ణ సుధాకర్, గుత్తి మల్లిఖార్జున్, పాటలు: కాసర్ల శ్యాం, జిల్లెల ప్రసాద్, సంగీతం: జె.పి, ఫైట్స్: నందు, ఎడిటింగ్: మేనగ శ్రీను, సినిమాటోగ్రాఫర్: సూర్య ఎన్ఆర్ఎం, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోటపాటి శ్రీను, నిర్మాత: కందిమళ్ళ వెంకట చంద్రశేఖర్.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement