బ్రూస్‌లీ టైటిల్‌ సాంగ్‌కి షారూఖ్‌ అప్రిసియేషన్‌.!

ఆమధ్య రామోజీ ఫిల్మ్‌సిటీలో మహేష్‌ కొత్త సినిమా బ్రహ్మూెత్సవం సెట్స్‌కి షారూఖ్‌ ఖాన్‌ వెళ్ళి యూనిట్‌ని పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్‌చరణ్‌ అప్‌కమింగ్‌ మూవీ బ్రూస్‌లీ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ జరుగుతుండగా సెట్‌కి వెళ్ళిన షారూఖ్‌ని చూసి యూనిట్‌ సభ్యులంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారట. రాత్రి రెండు గంటల వరకు షూటింగ్‌ను చూస్తూ గడిపిన షారూఖ్‌ టైటిల్‌ సాంగ్‌కి ఫిదా అయిపోయాడట. రామ్‌చరణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ని షారూఖ్‌ అప్రిషియేట్‌ చేశాడట. షారూఖ్‌ఖాన్‌ మనసు దోచుకున్న ఈ పాట కోసం ఆడియన్స్‌, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షారూఖ్‌ ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ దిల్‌వాలే షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆరోజు షూటింగ్‌ కంప్లీట్‌ అయిన తర్వాత బ్రూస్‌లీ సెట్‌కి వచ్చి రాత్రి రెండు గంటల వరకు సాంగ్‌ షూటింగ్‌ని చూస్తూ గడిపిన మూమెంట్స్‌ని బ్రూస్‌లీ సినిమా ఎండ్‌ టైటిల్స్‌లో మనం కూడా చూడబోతున్నాం.

bollywood star shah rukh khan in bruce lee set
shah rukh appreciated ramcharan
sharukh surprise visit to bruce lee set brucelee movie on 16th oct
Advertisement
Advertisement