Advertisement

ఎన్టీఆర్ ఆవిష్కరించిన కుమారి 21 F టీజర్!

Fri 02nd Oct 2015 11:21 PM
kumari 21f teaser release,ntr,sukumar,devisriprasad,raj tarun  ఎన్టీఆర్ ఆవిష్కరించిన కుమారి 21 F టీజర్!
ఎన్టీఆర్ ఆవిష్కరించిన కుమారి 21 F టీజర్!
Advertisement

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు. రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్  టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా.. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తితో ఇక్కడకి వచ్చాను. సుకుమార్ గారు డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో విషయం ఉంటుంది. ఆయన సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా.. దాన్ని ప్రేక్షకుడు సరిగ్గా అర్ధం చేసుకోకపోవడమే కాని ఆయన సబ్జెక్టులో మాత్రం పొరపాటు ఉండదు. మీరు తీసే ఫ్లాప్ సినిమాకు కూడా గౌరవం ఉంటుంది సర్ అని ఆయనకు చెప్పాను. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రంలో నేను నటించడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. సుకుమార్ గారి దగ్గర పని చేసిన సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఉయ్యాలా జంపాలా సినిమాలో రాజ్ తరుణ్ అధ్బుతంగా నటించాడు. కుమారి 21ఎఫ్ తనకు హీరోగా ఎదగడానికి మంచి స్టెప్. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

సుకుమార్ మాట్లాడుతూ.. ఒక సంవత్సరం క్రితం ఈ కథ రాసుకున్నాను. ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో టైం దొరికినప్పుడు కుమారి 21ఎఫ్ కథను సిద్ధం చేసాను. నిజానికి సినిమా టీజర్ ను లండన్ లో రిలీజ్ చేయాలనుకున్నాం. కాని షెడ్యూల్స్ కుదరకపోవడం వలన హైదరాబాద్ లోనే చేసాం. మొదట ఎన్టీఆర్ ను టీజర్ రిలీజ్ చేయమని అడగడానికి సంకోచించాను. ఆ విషయం ఆయన తెలుసుకొని షూటింగ్ లో వన్ మోర్ అడగడానికి లేని మొహమాటం ఇప్పుడు ఎందుకు వచ్చింది సర్ అని అన్నారు. ఈ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ముగ్గురు ఇడియట్స్ కథ. ఒక ఇడియట్ నేనైతే మరొకరు దేవిశ్రీప్రసాద్ ఇంకొకరు రత్నవేలు. ఇందులో ఒక ఇడియట్ అయిన నేను సినిమా నిర్మించాలని మిగిలిన ఇద్దరినీ అడిగాను. వారు ఆ సమయంలో చెప్పిన మాటలు గుర్తొస్తే నాకు ఇప్పటికి కన్నీళ్లు వస్తాయి. ఆ విషయం ఆడియో ఫంక్షన్ రోజు చెప్తాను. ఈ సినిమా హీరోగా  కొత్త అబ్బాయిని తీసుకోవాలనుకున్నాం. కాని రాజ్ తరుణ్ నేను చేస్తా అని లాగేసుకున్నాడు. ఖతర్నాక్ కుర్రాడు. చాలా బాగా నటించాడు. ఈ సినిమాతో రాజ్ కు అమ్మాయిల్లో ఫ్యాన్స్ పెరిగిపోతారు. హీరోయిన్ గా వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసి సినిమా ఓపెనింగ్ కూడా చేసేసాం. కాని ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. ఆ సమయంలో మా ఆఫీస్ లో హేభ పటేల్ ను చూసి హీరోయిన్ గా తను సెట్ అవుతుందని సెలెక్ట్ చేసాం. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.. అని చెప్పారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. మొదటిసారి సుకుమార్ గారు ప్రొడ్యూసర్ గా చేస్తున్న సినిమా ఇది. టైటిల్ ను కాన్సెప్ట్ గా తీసుకొని టీజర్ లో చెప్పడం సుకుమార్ గారికే సాధ్యం. సుకుమార్ గారు రాసిన స్క్రిప్ట్ ను డైరెక్టర్ సూర్య ప్రతాప్ అధ్బుతంగా ప్రెజెంట్ చేసారు. రాజ్ తరుణ్, హేభా పటేల్ బాగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ రత్నవేలు గారు. వీరందరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి.. అని చెప్పారు.

రత్నవేలు మాట్లాడుతూ.. ఆర్య సినిమా నుండి సుకుమార్ గారితో అసోసియేట్ అయ్యి పని చేస్తున్నాను. సుకుమార్ గారి కోసం ఆయన బ్రిలియంట్ స్క్రిప్ట్ కోసం నేను ఈ సినిమాకు పని చేసాను. ఆయన చాలా రొమాంటిక్ గా ఉంటారు. నేను ఎప్పుడూ ఆయనను రొమాంటిక్ సినిమాలు చేయమని చెప్తూ ఉంటాను. ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన రొమాంటిక్ మూవీ. దేవిశ్రీప్రసాద్ అల్టిమేట్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతాప్ గారు స్క్రిప్ట్ బాగా హ్యాండిల్ చేసారు.. అని చెప్పారు.

సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. నాకు తల్లి, తండ్రి, గురువు ఎవరైనా ఉన్నారంటే అది సుకుమార్ గారే. అయనతో ఏమైనా షేర్ చేసుకోగలను. ఈ స్క్రిప్ట్ కోసం ఆయనతో సంవత్సరం నుండి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన రాసిన కథను నేను డైరెక్ట్ చేయడం అద్రుష్టంగా భావిస్తున్నాను. దేవి గారితో ఇంతకముందు కరెంట్ సినిమా కోసం పని చేసాను. ఇది మా కాంబినేషన్ లో రెండో మూవీ. రత్నవేలు గారి సినిమాకు బ్యాక్ బోన్.. అని చెప్పారు.

థామస్ రెడ్డి మాట్లాడుతూ.. సుకుమార్ గారు ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొని సినిమా చేసారు. కేవలం టీజర్ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాసుకొని షూట్ చేసారు. టీజర్ కోసం టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు ఎంతో ఎఫర్ట్ పెట్టి పని చేసారు. సినిమా టీజర్ ను మించి ఉంటుందని చెప్పగలను. సూర్య ప్రతాప్ గారు అధ్బుతంగా ప్రజెంట్ చేసారు. రాజ్ తరుణ్, హేభ పటేల్ బాగా నటించారు. ఈ సినిమాతో వారిద్దరికీ మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, రాజ్ తరుణ్, హేభ పటేల్, విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్,  నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement