Advertisement

వీలైతే ప్రేమిద్దాం మూవీ ఆడియో విశేషాలు!

Mon 28th Sep 2015 04:31 AM
veelaithe premiddam,venkat,teja,raja sreedhar  వీలైతే ప్రేమిద్దాం మూవీ ఆడియో విశేషాలు!
వీలైతే ప్రేమిద్దాం మూవీ ఆడియో విశేషాలు!
Advertisement

రాజా శ్రీధర్, రాజు, పృథ్వి, తులసి, చంద్రకళ ప్రధాన పాత్రల్లో వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై వెంకట్ దర్శకత్వంలో తేజ నిర్మిస్తున్న చిత్రం వీలైతే ప్రేమిద్దాం. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నిఖిల్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ఈ సందర్భంగా..

నిఖిల్ మాట్లాడుతూ.. దర్శకుని ఆలోచనతో సినిమా స్టార్ట్ అయినా దాన్ని స్క్రీన్ పై చూపించడంలో నిర్మాత పాత్ర చాలా ముక్యమైంది. ప్రతి సినిమాకు సమానమైన వాల్యూ ఇవ్వాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా చూపించకూడదు. మంచి సందేశంతో కూడిన ఈ కమర్షియల్ మూవీ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. నిర్మాతల శ్రేయస్సు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసాం. విడుదలయిన ప్రతి చిన్న చిత్రానికి ప్రస్తుతం ఉన్న 18 మల్టిప్లెక్స్ థియేటర్లలో 5 మల్టిప్లెక్స్ లను కేటాయించనున్నాం. వచ్చే నెల నుండి ఈ విధానాన్ని అమలు పరచనున్నాం. సినిమా టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అందరికి తొందరగా రీచ్ అవుతుంది. కొత్త డైరెక్టర్ అయిన సినిమాను బాగా డైరెక్ట్ చేసాడు. ఖచ్చితంగా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుంది.. అని చెప్పారు.

ప్రిన్స్ మాట్లాడుతూ.. వెంకట్ నాకు కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పటి నుండి మంచి పరిచయం ఉంది. ఈరోజు డైరెక్టర్ గా ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

నిర్మాత తేజ మాట్లాడుతూ.. సినిమాలో అర్ధవంతమైన పాటలుంటాయి. ఆకాష్ గారు మంచి మ్యూజిక్ అందించారు. కాని ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. వెంకట్ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా చేసాడు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. వీధి డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన నేను ఈరోజు దర్శకునిగా మారడానికి ఎందరో సహకరించారు. దర్శకునిగా ఎలాంటి అనుభవం లేకపోయినా నాతో కలిసి సినిమా నిర్మించిన తేజ గారికి థాంక్స్. నేటి యువతకు ప్రేమ అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. తల్లి తండ్రుల ఆలోచనల గురించి పట్టించుకోవట్లేదు. అలా కాకుండా ముందు లక్ష్యాన్ని నెరవేర్చుకొని ఆ తరువాత వీలైతే ప్రేమిద్దాం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.

రాజా శ్రీధర్ మాట్లాడుతూ.. సినిమా పెద్ద హిట్ కావాలి. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.

ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్: ఉత్తర కుమార్, స్టిల్స్: వెంకటేష్, కో డైరెక్టర్: ఆర్.సురేష్, ఎడిటర్: ఉపేంద్ర, కెమెరామెన్: అనిల్ పల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడారి సుజాత, సహ నిర్మాతలు: బండారు మంగమ్మ, ఆడారి రామకృష్ణ, దర్శకత్వ పర్యవేక్షణ: ఆడారి మూర్తి, ప్రొడ్యూసర్: తేజ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విశాఖ థ్రిల్లర్స్ వెంకట్.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement