Advertisementt

నిర్మల కాన్వెంట్‌ లో నాగార్జున!

Sun 06th Sep 2015 09:44 AM
nirmala convent,nagarjuna,srikanth son,roshan,sreya sharma,nirmala convent movie details  నిర్మల కాన్వెంట్‌ లో నాగార్జున!
నిర్మల కాన్వెంట్‌ లో నాగార్జున!
Advertisement
Ads by CJ

కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చెయ్యడంలో, కొత్త తరహా చిత్రాల్ని నిర్మించడంలో ఎప్పుడూ ముందుండే కింగ్‌ నాగార్జున ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఓ కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు. అంతా కొత్తవారితో చేసిన ఉయ్యాలా జంపాలా చిత్రానికి కూడా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. మళ్ళీ ఇప్పుడు మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న నిర్మల కాన్వెంట్‌ చిత్రం ద్వారా రోషన్‌ అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయా శర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 

ప్రత్యేక పాత్రలో కింగ్‌ నాగార్జున 

జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్‌ సాలూరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. జైపూర్‌లో మొదటి షెడ్యూల్‌, మెదక్‌లో రెండో షెడ్యూల్‌ జరుపుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ సోమవారం నుంచి అరకులో జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారు. 

కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ