Advertisementt

'మౌనం' సినిమా ప్రారంభం!

Wed 26th Aug 2015 09:22 AM
mounam movie,kishan sagar,murali krishan,ishwarya  'మౌనం' సినిమా ప్రారంభం!
'మౌనం' సినిమా ప్రారంభం!
Advertisement
Ads by CJ

మురళి కృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో లాస్ ఏంజిల్స్ టాకీస్ పతాకంపై సంధ్యా మోషన్ పిక్చర్స్ సమర్పణలో కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్య ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'మౌనం'. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, శ్రీ మిత్ర  చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ "'మౌనం' అనే టైటిల్ ఈ చిత్రానికి యాప్ట్ అనిపించింది. సైలెన్స్ అనేదానికి హారర్ మూవీలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక పాట మాత్రమే ఉంది. రీరికార్డింగ్ సినిమాలో చాలా ముఖ్యమైంది" అని చెప్పారు.

కిషన్ సాగర్ మాట్లాడుతూ "డి.ఓ.పి గా చేసే నాకు ఈ చిత్రం ద్వారా దర్శకత్వం వహించే అవకాశం ఇస్తున్న నిర్మాతకు థాంక్స్. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

మురళి కృష్ణ "హీరోగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు" అని చెప్పారు.

ఐశ్వర్య మాట్లాడుతూ "మౌనం అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్. ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.

సంధ్యా మోషన్ పిక్చర్స్ అధినేత రవి మాట్లాడుతూ "లాస్ ఏంజిల్స్ టాకీస్ మరియు సంధ్య మోషన్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించే మొదటి చిత్రమిది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి(27-8-2015) మొదలు పెట్టి అక్టోబర్ నెలాఖరున పూర్తి చేయనున్నాం. ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న కిషన్ గారు ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయంకానున్నారు" అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బలుసు రామారావు, కథ: అనిల్ కె నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, దర్శకత్వం-డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కిషన్ సాగర్.ఎస్, నిర్మాత: అల్లూరి సూర్యప్రసాద్.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ