Advertisementt

'బెస్ట్ యాక్టర్స్ జీవితంలో' రిలీజ్ కు రెడీ!

Mon 24th Aug 2015 04:23 AM
best actors movie,shamili,arun pawar,kumar annam reddy  'బెస్ట్ యాక్టర్స్ జీవితంలో' రిలీజ్ కు రెడీ!
'బెస్ట్ యాక్టర్స్ జీవితంలో' రిలీజ్ కు రెడీ!
Advertisement
Ads by CJ

నందు, షామిలి,  క్రతి, శేష, మధురిమ, అభిషేక్ మహర్షి ప్రధాన పాత్రల్లో మారుతి టీమ్ వర్క్స్ పతాకంపై అరుణ్ పవర్ దర్శకత్వంలో, కుమార్ అన్నమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'బెస్ట్ యాక్టర్స్ జీవితంలో'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 28 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

దర్శకుడు అరుణ్ పవర్ మాట్లాడుతూ "జీవితంలో నిరాశకు గురైన ఓ వ్యక్తి ప్రశాంత జీవితాన్ని గడపడానికి ఓ ప్రాంతానికి వెళ్తాడు. అలా వెళ్ళిన అతనకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమాకి కిట్టు మంచి డైలాగ్స్ రాసాడు. 120 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో 90 నిమిషాల పాటు ప్రేక్షకులను నవ్వించడానికే ప్రయత్నించాం. ఈ చిత్రంలో సప్తగిరి పాత్ర హైలైట్ గా నిలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. ఆగస్ట్ 28 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం"

షామిలి మాట్లాడుతూ "ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్నాను. సినిమాలో కామెడీ బావుంటుంది. జీవన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నందుకి, నాకు మధ్య వచ్చే రొమాంటిక్ విజువల్ గా చాలా బావుంటుంది" అని చెప్పారు.

కిట్టు విస్సాప్రగడ మాట్లాడుతూ "ఈ చిత్రానికి పాటలు, మాటలు అందించినందుకు సంతోషంగా ఉంది. ఇదొక కామెడీ ఎంటర్టైనింగ్ చిత్రం. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: విశ్వ, ఎడిటింగ్: ఉద్ధవ్ , డైలాగ్స్: కిట్టు , దాసరి వెంకట్ సతీష్, నిర్మాత: కుమార్ అన్నమ్ రెడ్డి, దర్శకుడు: అరుణ్ పవర్.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ