Advertisement

కబాడీ ఆడేస్తున్న కబాలీ

Tue 18th Aug 2015 02:45 AM
kabali,rajinikanth,don kabali,kabaleeswaran  కబాడీ ఆడేస్తున్న కబాలీ
కబాడీ ఆడేస్తున్న కబాలీ
Advertisement

కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో రజినీకాంత్ అన్న పేరు వింటేనే  వైబ్రేషన్స్ పుడతాయి. తలైవా స్టైల్, స్మైల్ చూసారంటే హాలివుడ్ నటులు సైతం తలదించుకుంటారు అనడంలో సందేహం లేదు. అంతటి సూపర్ స్టార్ గత కొన్నాళ్ళుగా ఆరోగ్యం సహకరించక, సూపర్ హిట్టు లేక మొహం మోత్తాడు. ఈసారి కొడితే అలా ఇలా ఉండకూడదు అనుకున్నాడో ఏమో గానీ ఏకంగా డాన్ కబాలీశ్వరన్ అనే దక్షిణ చెన్నైకి చెందిన ప్రముఖ మాఫియా డాన్ కథతో సిద్ధమవుతున్నాడు. రంజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం తాలూకు టైటిల్ కూడా అనౌన్స్ చేయకముందే అభిమానులే 'కబాలి' అన్న పేరును కన్ఫార్మ్ చేసుకుని, భూమికి నలుమూలలా రజిని కీర్తిని వ్యాపింపజేస్తున్నారు. అంతర్జాలంలో ప్రముఖంగా చెప్పుకునే ట్విట్టర్లో వరల్డ్ వైడుగా 'కబాలి'ని ట్రెండ్ చేస్తున్నారంటే ఈయన ఫ్యాన్స్ మామూలోళ్ళు కాదు. పేరుపెట్టని 'కబాలి' సినిమాని కూడా ఇంతలా ప్రేమిస్తున్నారంటే సూపర్ స్టార్ అభిమానాన్ని ఎలా వర్ణించాలో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడే ఇలా ఉంటె కబాలి గనక ఈ ఏడాదే రిలీజయితే అందరినీ కబాడి ఆడించేయదు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement