Advertisement

హారర్ కమ్ కామెడీ జోనర్ లో మరో కొత్త సినిమా!

Mon 17th Aug 2015 03:19 AM
anaganaga oka chithram,siva,megha sree,prabhakar reddy  హారర్ కమ్ కామెడీ జోనర్ లో మరో కొత్త సినిమా!
హారర్ కమ్ కామెడీ జోనర్ లో మరో కొత్త సినిమా!
Advertisement

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్‌, గోవర్షిణి ఫిలింస్‌ పతాకాలపై జె.ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘అనగనగా ఒక చిత్రమ్‌’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను తెలంగాణా సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందించారు. వినోద్‌ యాజమాన్య సంగీతం అందించిన ఈ ఆడియో మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా.. 

దాసరి నారాయణరావు మాట్లాడుతూ "చాలా రోజుల నుండి నేను ఆడియో ఫంక్షన్స్ కు రావడం మానేసాను. దానికి కారణం సినిమా మీద ఉన్న గౌరవాన్ని తగ్గిస్తూ ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి రావడానికి కారణం మల్లయ్య. ఆయన మా కుటుంబంలో వ్యక్తి. ఈ చిత్రాన్ని ప్రారంభించిన మొదటిరోజే ఆడియో ఫంక్షన్ కు రావాలని అడిగారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'బాహుబలి' , 'శ్రీమంతుడు' అనే రెండు పెద్ద హిట్ సినిమాలు వచ్చాయి. 'సినిమా చూపిస్త మావ' చిన్న చిత్రమైనా బావుందని చెబుతున్నారు. ఈ విజయాలతో ఇండస్ట్రీలో కొత్త ఎనర్జీ వచ్చింది. ఇదొక శుభ పరిణామం. 'ప్రేమకథా చిత్రం' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడే ఈ చిత్రానికి కూడా పని చేసాడు. ఫుల్ కామెడీతో ఈ చిత్రం నడుస్తుంది. సినిమాలో ఉన్న 5 పాటలలో నాకు 3 పాటలు బాగా నచ్చాయి. వినోద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "మల్లయ్య గారు వారి కుమారుడ్ని హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తున్నంతసేపు శివ బాగా నటించాడనిపించింది. వినోద్ అందించిన మ్యూజిక్ బావుంది. రీసెంట్ గా విడుదలయిన 'బాహుబలి' , 'శ్రీమంతుడు' చిత్రాలు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా అన్ని బాషలలో విడుదలయ్యి మంచి సక్సెస్ ను సాధించి తెలుగు సినిమా స్టామినా ఎంతో చూపించాయి. అలానే ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలు కూడా వస్తున్నాయి. కొత్త సినిమాలు, కొత్త కథానాయకులు ఇండస్ట్రీకు రావాలి. ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి. టీమ్ అందరికి నా ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

సి.కళ్యాన్ మాట్లాడుతూ "సినిమాలో పాటలన్నీ అధ్బుతంగా ఉన్నాయి. ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. ఈ సినిమాతో శివకు మంచి బ్రేక్ రావాలి. డైరెక్టర్ కు టోటల్ టీమ్ కు ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

దర్శకుడు జె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ "హీరో శివ ఈ సినిమాలో అధ్బుతంగా చేసాడు. వినోద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇదొక టిపికల్, లవ్ కమ్ థ్రిల్లర్ స్టొరీ. హై టెక్నికల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అని చెప్పారు.

హీరో శివ మాట్లాడుతూ "డైరెక్టర్ గారు చాలా కూల్ గా ఉంటారు. సినిమా బాగా వచ్చింది. వినోద్ మ్యూజిక్  అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.

హీరోయిన్ మేఘశ్రీ మాట్లాడుతూ "తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు" అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దామోదర్ ప్రసాద్, హీరో ప్రిన్స్, సుదీర్ బాబు, మల్లిఖార్జునరావు, ఆది శేషగిరిరావు, ప్రభాస్ శ్రీను, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్‌, సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: వి.రవికుమార్‌, ఎడిటింగ్‌: సాయి, ఆర్ట్‌: విజయకృష్ణ, స్టిల్స్‌: బాబు, కాస్ట్యూమ్స్‌: కె.మురళి, మేకప్‌: రంగా, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: కొడాలిశ్రీనివాసరావు, ప్రొడక్షన్‌ మేనేజర్స్‌: నాగిరెడ్డి, ఆర్‌.రాంబాబు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: సుదర్శన్‌, హరీష్‌ సజ్జా, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: ఉమేష్‌ నాగ, జి.యం.మంజునాథ్‌, కో`డైరెక్టర్‌: యస్‌.నాగశ్రీనివాసరావు, నిర్మాతలు: జె.ప్రభాకరరెడ్డి, కొడాలి సుబ్బారావు, డైరెక్టర్‌ ఆఫ్‌ సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.ప్రభాకరరెడ్డి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement