Advertisement

చ‌ర‌ణ్‌... చిరు.. మ‌ధ్య‌లో ఐటెమ్ పాప‌!

Mon 17th Aug 2015 02:33 AM
ramcharan,chiranjeevi,iliyana,iliyana item song,srinuvaitla,  చ‌ర‌ణ్‌... చిరు.. మ‌ధ్య‌లో ఐటెమ్ పాప‌!
చ‌ర‌ణ్‌... చిరు.. మ‌ధ్య‌లో ఐటెమ్ పాప‌!
Advertisement

 

బ‌ర్త్ డే ద‌గ్గ‌రికొస్తున్నా చిరంజీవి 150వ సినిమా గురించి పురోగ‌తేమీ క‌నిపించ‌డం లేదు. దీన్నిబ‌ట్టి చిరు హీరోగా రీ ఎంట్రీ ఇవ్వ‌డం ఇప్ప‌ట్లో ఉండ‌దేమో అంటున్నారంతా. చిరు రీ ఎంట్రీ సినిమా అంటే ఘ‌నమైన క‌థ కంప‌ల్స‌రీ. ఆ క‌థ కోస‌మే ఇన్నాళ్లూ చిరు అన్వేషించారు. కానీ ఎవ్వ‌రూ స‌రైన క‌థ ఇవ్వ‌లేదు. మ‌రోప‌క్క 'బాహుబ‌లి'  వ‌చ్చి తెలుగు సినిమా స్టాండ‌ర్డ్స్‌ని పెంచింది. ఇప్పుడు ఏ సినిమా వ‌చ్చినా బాహుబ‌లితో పోలుస్తున్నారు. ఈ ద‌శ‌లో మెగాస్టార్ సినిమా చేస్తే అది మ‌రో రేంజ్‌లో ఉండాలి.  ఇవ‌న్నీ చూసుకొనే చిరు హీరోగా 150వ సినిమా చేయ‌డం గురించి వెన‌క్కి త‌గ్గాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇంకొన్నాళ్లు ఆగి, మంచి క‌థ వ‌చ్చిన‌ప్పుడే చేద్దాం అని ఆయ‌న భావిస్తున్నాడ‌ట‌. 

అయితే చ‌ర‌ణ్ సినిమాలో అతిథి పాత్ర‌లో క‌నిపించాల‌ని మాత్రం నిర్ణ‌యం తీసేసుకొన్నాడు చిరు. తెర‌పై ఆయ‌న ప‌దినిమిషాల‌పాటు క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఆ ప‌ది నిమిషాల్లోనే ఓ ఐటెమ్ పాట కూడా ఉంటుంద‌ట‌. ఆ పాట‌లో చ‌ర‌ణ్‌, చిరుతోపాటు ఓ ఐటెమ్ పాప కూడా క‌నిపించ‌బోతోంద‌ని స‌మాచారం.  ఐటెమ్ భామ‌గా ఇలియానాని ఎంపిక చేసే ఆలోచ‌న‌ల‌తో చిత్ర‌బృందం ఉన్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఇలియానాతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం.

 చ‌ర‌ణ్ సినిమానే త‌న 150వ సినిమాగా భావిస్తూ చిరు ఇందులో స్పెష‌ల్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలిసింది. తెర‌పై క‌నిపించేది కాసేపే అయినా ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసేలా ఉండాల‌ని ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌కి చెప్పాడ‌ట చిరంజీవి. దీంతో శ్రీనువైట్ల ప్ర‌త్యేక‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకొని మెగాస్టార్ న‌టించే స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. చర‌ణ్‌పై తీయాల్సిన పార్ట్ అంతా పూర్తి చేసి ఆ త‌ర్వాతే చిరుపై స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement