Advertisement

డబ్బింగ్ సినిమాలకు వెళ్ళడం మానేసా-కోనవెంకట్

Mon 10th Aug 2015 03:52 AM
jayasurya movie,vishal,kajal,suseendran,nageshwarareddy  డబ్బింగ్ సినిమాలకు వెళ్ళడం మానేసా-కోనవెంకట్
డబ్బింగ్ సినిమాలకు వెళ్ళడం మానేసా-కోనవెంకట్
Advertisement

విశాల్, కాజల్ అగర్వాల్ జంటగా సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై జె.రామాంజనేయులు సమర్పణలో సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'పాయుంపులి'. ఈ చిత్రాన్ని 'జయసూర్య' అనే టైటిల్ తో జి.నాగేశ్వరరెడ్డి, ఎస్.నరసింహ ప్రసాద్ నిర్మాతలుగా తెలుగులో అనువదిస్తున్నారు. శనివారం దసపల్లా హోటల్ లోని రచయిత కోనవెంకట్, దర్శకుడు దశరథ్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంబంధించిన లోగోను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

కోనవెంకట్ మాట్లాడుతూ "లౌక్యం సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా, గీతాంజలి చిత్రంతో ప్రెజంటర్ గా మారిన నాకు ఆ రెండు చిత్రాలు మంచి హిట్స్ ను ఇచ్చాయి. నమ్మకంతో కొత్త మార్గాన్ని ఎంచుకొని సక్సెస్ అయ్యాను. అలానే డిస్ట్రిబ్యూటర్ అయిన నా స్నేహితుడు నాగేశ్వరరెడ్డి నిర్మాతగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ ప్రయాణంలో ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను డబ్బింగ్ సినిమాలకు వెళ్ళడం మానేసాను. అయితే ఇటీవల విడుదలయిన 'బాహుబలి' , ' శ్రీమంతుడు' చిత్రాలను ఆదరించి తమిళ ప్రజలు వారి ధోరణిని మార్చుకున్నారు. వారి దృక్పధంలో మార్పు వచ్చింది. అందుకే నేను కూడా నా ఆలోచనలు మార్చుకొని అనువాద చిత్రాలు చూడాలనుకుంటున్నాను. ఇదొక పోలీస్ స్టొరీ. ఈ మధ్యకాలంలో పోలీసుల కథలపై వస్తున్న చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ చిత్రం కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

దశరథ్ మాట్లాడుతూ "ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుశీంద్రన్ 'నా పేరు శివ' లాంటి మంచి చిత్రాన్ని తీసాడు. సెన్సిబుల్ డైరెక్టర్. ఈ సినిమాను తెలుగులో అనువదిస్తున్న నిర్మాతలు త్వరలోనే నేరుగా తెలుగు చిత్రాన్ని నిర్మించాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

నిర్మాత జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ "మొదటిసారిగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. విశాల్ మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని అనువదిస్తున్నాం. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి చిత్రాలను తీయాలనే ఉద్దేశ్యంతో ఉండే నటుడు. ఈ నెల 22న ఈ చిత్ర ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ 4న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నిర్మాతగా నా ప్రయాణాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: వేల్ రాజ్, సంగీతం: డి.ఇమ్మాన్, ఎడిటర్: ఆంటోనీ, నిర్మాతలు: జి.నాగేశ్వరరెడ్డి, ఎస్.నరసింహ ప్రసాద్, దర్శకత్వం: సుశీంద్రన్. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement