Advertisementt

Ads by CJ

'ధనలక్ష్మి తలుపు తడితే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!

Thu 23rd Jul 2015 07:54 AM
dhanalakshmi thalupu thadithe,dhanaraj,thummalapalli ramasathyanarayana  'ధనలక్ష్మి తలుపు తడితే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
'ధనలక్ష్మి తలుపు తడితే' ప్లాటినం డిస్క్ ఫంక్షన్!
Advertisement
Ads by CJ

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై అవుట్‌ అండ్‌ అవుట్‌ హిలేరియస్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌ నిర్మిస్తున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ.  ఆ చిత్రం పేరు ‘ధనలక్ష్మి తలుపు తడితే..!!’ సాయి అచ్యుత్‌ చిన్నారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనరాజ్‌, మనోజ్‌నందం, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌సాయి, సింధుతులాని, శ్రీముఖి, నాగబాబు, తాగుబోతు రమేష్‌, రచ్చరవి, షేకింగ్‌ శేషు మరియు జబర్దస్త్‌ బ్యాచ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర బృందం ప్లాటినం డిస్క్ వేడుకను బుదవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా..

రసమయి బాలకిషన్ మాట్లాడుతూ "ఈ సినిమా కోసం ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతో కష్టపడి ఒక కమిట్మెంట్ తో పని చేసారని తెలుస్తోంది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

నరేష్ మాట్లాడుతూ "ఈ చిత్ర దర్శకుడు సాయి అచ్యుత్ నాకు బాగా తెలుసు. మంచి టెక్నీషియన్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ "నేను ధనరాజ్ కలిసి గుండెల్లో గోదారి సినిమాలో నటించాం. తను ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ ను సాధించి చిత్ర నిర్మాతలకు లాభాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "సినిమా స్క్రిప్ట్ చాలా బావుంది. ధనరాజ్, సాయి అచ్యుత్ ఈ స్క్రిప్ట్ నాకు చెప్పగానే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడానికి అంగీకరించాను. భోలే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని చెప్పారు.

సాయి అచ్యుత్ చిన్నారి మాట్లాడుతూ "రామసత్యనారాయణగారు మంచి సపోర్ట్‌ను అందించి ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఈ సినిమాను చాలా బాధ్యతతో తీశాను. సినిమా చూసినవారికి మంచి అనుభూతి కలుగుతుంది. ఇదొక విలన్ జర్నీ సినిమా. భోలే మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు" అని చెప్పారు.

బోలే శావలి మాట్లాడుతూ ‘'దర్శకడు సాయి అచ్యుత్‌ ఒక దీక్షలా ఈ సినిమాని పూర్తి చేశాడు.కనకాధర స్తోత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా చేయడానికి కొంచెం హోమ్ వర్క్ చేసాను. సాయి అచ్యుత్ మంచి కథను సిద్ధం చేసుకున్నాడు. పాటలకు ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా కూడా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు. 

ధనరాజ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో చాలా మంది నేను అడిగిన వెంటనే ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. ఈ సినిమాకి కథే హీరో. దర్శకుడు నేను అనుకున్నట్లుగానే సినిమాని తీశాడు. నేను నమ్మిన కథ ఇది. దీని రిజల్ట్ కు కర్త, కర్మ, క్రియను కూడా నేనే. భోలే మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ నెల 31న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అంబికా కృష్ణ, గొట్టిముక్క పద్మారావు, వల్లూరి పల్లి రమేష్‌, మనోజ్‌ నందం, పద్మిని, విజయ్‌సాయి, అనిల్‌ కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: శివ వై.ప్రసాద్‌, కెమెరామెన్‌: జి.శివకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రసాద్‌ మల్లు (యుఎస్‌ఎ), ప్రతాప్‌ భీమిరెడ్డి (యుఎస్‌ఎ), సమర్పణ: మాస్టర్‌ సుక్కురామ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-సంభాషణలు-దర్శకత్వం: సాయి అచ్యుత్‌ చిన్నారి.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ