మీనా కూతురు తెర‌పైకి!

Fri 26th Jun 2015 02:29 AM
actress meena,atle director,meena dauther debut movie,vijay,shankar,director atlee   మీనా కూతురు తెర‌పైకి!
మీనా కూతురు తెర‌పైకి!
Sponsored links
ద‌క్షిణాదిలో మీనా పేరు తెలియ‌ని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. ఆమె తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో న‌టించి మంచి గుర్తింపును తెచ్చుకొంది. ఇటీవ‌ల త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల్ని ఎంచుకొంటూ ప్ర‌యాణం చేస్తోంది. అయితే తాజాగా ఆమె త‌న కూతురుని తెర‌పైకి తీసుకొస్తోంద‌ని స‌మాచారం. విజ‌య్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ శిష్యుడు అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ఓ త‌మిళ చిత్రంలో మీనా కూతురు నైనికా న‌టించ‌బోతోంద‌ట‌. ఈ సినిమాలో విజ‌య్ ఓ చిన్న పాప‌కి తండ్రిగా క‌నిపించాల్సి ఉంటుంద‌ట‌. ఆ పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ట‌. దీంతో మీనా కూతురుతో ఆ పాత్ర చేయించాల‌ని చిత్ర‌బృందం డిసైడ్ అయ్యిన‌ట్టు స‌మాచారం. విజ‌య్ అభిమాన క‌థానాయిక కూడా మీనానేన‌ట‌. సో విజ‌య్ చిత్రంలో త‌న కూతురుతో పాత్ర చేయించేందుకు మీనా ఓకే చెప్పేసింద‌ట‌. 
Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019