Advertisement

వరుణ్‌ తేజ్‌ లోఫర్‌ అంటున్న పూరి జగన్నాథ్‌

Sun 21st Jun 2015 06:48 AM
hero varun tej new movie loafer,director puri jagannath,heroine disha patani,producer c.kalyan,varun tej loafer from july 1st  వరుణ్‌ తేజ్‌ లోఫర్‌ అంటున్న పూరి జగన్నాథ్‌
వరుణ్‌ తేజ్‌ లోఫర్‌ అంటున్న పూరి జగన్నాథ్‌
Advertisement

‘ముకుంద’ చిత్రంతో హీరోగా పరిచయమైన మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రానికి ‘లోఫర్‌’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. 

ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌టైమ్‌ చేస్తున్న మాస్‌ ఫిల్మ్‌ ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మదర్‌ సెంటిమెంట్‌, హై యాక్షన్‌ ఈ చిత్రంలో వుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ మాసీగా వుంటుంది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రవితేజకి ఇడియట్‌, మహేష్‌కి పోకిరి, ఎన్టీఆర్‌కి టెంపర్‌, చరణ్‌కి చిరుతల, బన్నికి దేశముదురు ఎలా మాస్‌ సినిమాలు అయ్యాయో అలా వరుణ్‌తేజ్‌కి ‘లోఫర్‌’ మంచి మాస్‌ సినిమా అవుతుంది. జూలై 1న ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమవుతుంది. జూలై 10 నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భారీ షెడ్యూల్‌ జరుగుతుంది. జూలై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేసి విజయదశమి కానుకగా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో ఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌ని అలరించే పూరి మార్క్‌ చిత్రంగా ‘లోఫర్‌’ రూపొందుతుంది’’ అన్నారు.

వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణమురళి, పవిత్ర లోకేష్‌తోపాటు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement