Advertisementt

10.2కోట్లు ప‌లికిన `శ్రీమంతుడు`

Sat 20th Jun 2015 09:02 AM
srimanthudu,sri manthudu satilite,maheshbabu,koratala siva,  10.2కోట్లు ప‌లికిన `శ్రీమంతుడు`
10.2కోట్లు ప‌లికిన `శ్రీమంతుడు`
Advertisement
Ads by CJ


శాటిలైట్ మార్కెట్ రూపేణా మ‌రోసారి మహేష్ త‌న స‌త్తా చూపాడు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన `శ్రీమంతుడు` శాటిలైట్ రైట్స్ రూః 10.2కోట్లు ప‌లికింద‌ట‌. జీ తెలుగు ఛాన‌ల్  పోటీప‌డి ఆ రేట్‌కి కొనుగోలు  చేసిన‌ట్టు తెలుస్తోంది. `మిర్చి` ఫేమ్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న చిత్రం కావ‌డం, ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో `శ్రీమంతుడు`కి మంచి ప్రీ రిలీజ్ బ‌జ్ క్రియేట్ అయ్యింది. దీంతో బ‌య్య‌ర్లు పోటీలు ప‌డి ఆ సినిమాని కొనేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ విష‌యంలోనూ ఛానల్స్ పోటీప‌డ్డాయ‌ట‌. చివ‌రికి జీ తెలుగు 10కోట్ల 20ల‌క్ష‌ల‌కు హ‌క్కుల్ని సొంతం చేసుకొన్న‌ట్టు స‌మాచారం. మ‌హేష్ సినిమాలు ఎప్ప‌టిక‌ప్పుడు శాటిలైట్ మార్కెట్‌ని పెంచుతూ వెళుతుంటాయి. ఈసారి శ్రీమంతుడు కూడా భారీ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాల్ని ఆక‌ట్టుకొంది. ఈ చిత్రం మ‌హేష్ పుట్టిన‌రోజుకి రెండు రోజుల ముందుగా ఆగ‌స్టు 7న  విడుల‌ద‌వుతోంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ