లండన్‌లో మకాం వేస్తున్న ఎన్టీఆర్‌, సుకుమార్‌.!

Tue 16th Jun 2015 03:05 AM
ntr and sukumar combo movie,ntr movie in london,bvsn prasad new movie with ntr and sukumar,rakul preeth singh  లండన్‌లో మకాం వేస్తున్న ఎన్టీఆర్‌, సుకుమార్‌.!
లండన్‌లో మకాం వేస్తున్న ఎన్టీఆర్‌, సుకుమార్‌.!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌, సుకుమార్‌ల ఫస్ట్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రిలయన్స్‌తో కలిసి బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ లండన్‌లో ప్రారంభమవుతోంది. జూన్‌ 25 నుంచి 50 రోజులపాటు జరిగే భారీ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పటికే సుకుమార్‌, పీటర్‌ హెయిన్స్‌ లండన్‌ చేరుకున్నారు. మిగతా యూనిట్‌ సభ్యులంతా జూన్‌ 22కి అక్కడికి చేరుకుంటారు. తన ప్రతి సినిమాను ఒక కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించే సుకుమార్‌ ఈ సినిమాని కూడా ఓ కొత్త పాయింట్‌తో రూపొందిస్తున్నాడు. ఇందులోని రివెంజ్‌ డ్రామా పాతదే అయినప్పటికీ దాన్ని కూడా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో డిజైన్‌ చేశాడట. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ని చూడని కొత్త లుక్‌లో ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. ప్రజెంట్‌ బిజీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. రిలయన్స్‌తో కలిసి అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మరో బ్లాక్‌బస్టర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా చేద్దామనుకుంటున్న ఎన్టీఆర్‌ ఈ సినిమాతో మరో పెద్ద కొట్టాలన్న కసితో వున్నాడట. లండన్‌లో జరిగే 50 రోజుల షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన సీన్స్‌, ఫైట్స్‌ షూట్‌ చేస్తారట. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ