Advertisement

సలోని ప్రత్యేకాకర్షణగా 'కళానిలయ క్రియేషన్స్' చిత్రం..!

Wed 10th Jun 2015 06:22 AM
kalanilaya creations,lakshman varma,parthu,saloni,siddhaans  సలోని ప్రత్యేకాకర్షణగా 'కళానిలయ క్రియేషన్స్' చిత్రం..!
సలోని ప్రత్యేకాకర్షణగా 'కళానిలయ క్రియేషన్స్' చిత్రం..!
Advertisement

సిద్దాంస్, రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాణంలో  'కళానిలయ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1' సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు లక్ష్మణ్ వర్మ మాట్లాడుతూ "ఈ సినిమా ఒకే జోనర్ కి సంబంధించిందని కాదు. థ్రిల్లర్, కామెడీ, లవ్ స్టొరీ అన్ని కలగలిపిన కథ. ఓ మైథలాజికల్ ఎపిసోడ్ తో సినిమా క్లైమాక్స్ ముగుస్తుంది. చిత్రబృందమంతా ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేసారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ట్రైలర్ లాంచ్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని చెప్పారు.

సహనిర్మాత పార్థు మాట్లాడుతూ "స్నేహితులమంతా కలిసి ఈ బ్యానర్ స్థాపించి మొదటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికి రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రస్తుతం మూడవ షెడ్యూల్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, టైటిల్ అనౌన్స్ చేయనున్నాం. ఈ నెల చివరి వారంలో సినిమా ఆడియో విడుదల చేసి, జూలై నెలలో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. సినిమాలో నటి సలోని నటించిన పాట ప్రతేకాకర్షణగా నిలుస్తుంది" అని చెప్పారు.

రాహుల్ మాట్లాడుతూ "ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ. సినిమాలో ఐదు పాటలున్నాయి. మూడు పాటలు షూటింగ్ కంప్లీట్ అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు" అని అన్నారు.

సిద్దాంస్ మాట్లాడుతూ "ఇది నా రెండవ చిత్రం. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకు తెలుగులో సినిమాలు రాలేదు. ఈ సినిమాలో నాదొక చాలెంజింగ్ రోల్" అని చెప్పారు.

సలోని మాట్లాడుతూ "ఈ సినిమాలో నేనొక స్పెషల్ సాంగ్ లో నటించాను. ఆ సాంగ్ లోనే సినిమా స్టొరీ అంతా నేరేట్ అవుతుంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ తేజస్విని, వెంకట్, నిక్సన్ తదిహరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, నిర్మాత: బి.రమేష్, సహా నిర్మాతలు: పార్థు, బాలాజీ, మురళీధర్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement