Advertisementt



నటి ఆర్తి అగర్వాల్‌ మృతి..!!

Sat 06th Jun 2015 01:32 PM
aarthi agarwal,dead,films,ranam 2  నటి ఆర్తి అగర్వాల్‌ మృతి..!!
నటి ఆర్తి అగర్వాల్‌ మృతి..!!
Advertisement
Ads by CJ

తెలుగు వెండి తెర మరో నటిని కోల్పోయింది. నటి ఆర్తి అగర్వాల్‌ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థూలకాయం, శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమెకు న్యూజెర్సీలో రెండు రోజుల క్రితం లైపో లైపో సక్షన్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ వికటించడంతో ఆమె మృతిచెందినట్లు సమాచారం.

తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆర్తీ అగర్వాల్‌ 2007లో వివాహం తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించారు. నువ్వు నాకు నచ్చావుతో తెలుగు తెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్‌ ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, నేనున్నాను, సంక్రాంతి, అందాల రాముడు తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే ఆమె భర్తతో విడిపోయిన అనంతరం తిరిగి ఇండస్ట్రీలో సెకండ్‌ ఇనింగ్స్‌ మొదలుపెట్టారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం 'రణం-2'.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ