Advertisementt

`దేశముదురు` జోడీ నిజమేనా?

Sat 06th Jun 2015 09:13 AM
allu arjun,hansika,allu arjun,hansika pair again,boyapati srinu,  `దేశముదురు` జోడీ నిజమేనా?
`దేశముదురు` జోడీ నిజమేనా?
Advertisement
Ads by CJ
ఒకసారి ఒక హీరోయిన్‌తో క‌లిసి న‌టిస్తే మ‌ళ్లీ ఆ హీరోయిన్‌ని రిపీట్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు బ‌న్నీ. మంచి పెయిర్  అనే టాక్ వ‌చ్చినా స‌రే.  మ‌రో కొత్త భామ‌ని ఎంచుకొనే న‌టిస్తుంటాడు. అలాంటి అల్లు అర్జున్ తాజాగా హ‌న్సిక‌తో క‌లిసి న‌టించాల‌ని నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌. ఆ నిర్ణ‌యం ప‌రిశ్ర‌మ‌ని షాకింగ్‌కి గురిచేసింది. అల్లు అర్జున్‌లో ఇంత మార్పేంటి అని అంతా మాట్లాడుకొంటున్నారు. `దేశ‌ముదురు`లో అల్లు అర్జున్‌, హ‌న్సిక క‌లిసి  అద‌ర‌గొట్టారు. వాళ్ళిద్దరినీ చూసి `భ‌లే పెయిర్...` అన్నారంతా. అయినా స‌రే అల్లు అర్జున్ మాత్రం హ‌న్సిక‌ని రిపీట్ చేయ‌లేదు. ఉన్నట్టుండి ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ ఆమెతో క‌లిసి న‌టించ‌డానికి  ఇటీవల ఓకే చెప్పేశాడ‌ట‌. హ‌న్సిక‌కీ, అల్లు అర్జున్‌కీ మ‌ధ్య మంచి ర్యాపో ఉంది. ఎప్ప‌ట్నుంచో ఇద్ద‌రూ క‌లిసి న‌టించాల‌నుకొంటున్నార‌ట‌. ఇటీవల బోయ‌పాటి శ్రీను హ‌న్సిక‌ పేరుని  సూచించ‌డంతో బ‌న్నీ వెంట‌నే ఓకే చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రున సినిమా మొద‌ల‌వుతున్న‌ట్టు స‌మాచారం. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ జ‌ట్టు క‌డుతున్న వీళ్లిద్ద‌రూ తెర‌పై ఎలా సంద‌డి చేస్తారో చూడాలి. అయితే ఈ జోడీతో సినిమా ఫిక్స్ అయ్యింది నిజమో కాదో చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ