Advertisement

'2000 క్రోర్ బ్లాక్ మనీ' ఆడియో విదుదల..!

Wed 03rd Jun 2015 09:13 AM
2000 crore black money movie,audio launch,pawan reddy,ramesh  '2000 క్రోర్ బ్లాక్ మనీ' ఆడియో విదుదల..!
'2000 క్రోర్ బ్లాక్ మనీ' ఆడియో విదుదల..!
Advertisement

 

నూతన నటీనటులు పవన్‌రెడ్డి, సిద్ధార్థ, సునీల్‌ జైశ్వాల్‌, కిషోర్‌, అంజలీరావ్‌ ప్రధాన పాత్రధారులుగా వర్ష ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రమేష్‌ ముక్కెర దర్శకత్వంలో పవన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘2000 క్రోర్‌ బ్లాక్‌మనీ’. ఈ చిత్రం ఆడియో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరామ్ నాయక్, తెలంగాణ సభాపతి మధుసూదనాచారి కుమారుడు ప్రశాంత్, సానా యాదిరెడ్డి, కళ్యాణ్ రామ్ 'కత్తి' దర్శకులు మల్లికార్జున్, ప్రేమ్ రాజ్ తదితరులు హాజరయ్యారు. బలరామ్ నాయక్ ఆడియో సిడిలను ఆవిష్కరించి తొలి సిడిని సానా యాదిరెడ్డి అందించారు. మల్లికార్జున్ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. 

సానా యాదిరెడ్డి మాట్లాడుతూ "వరంగల్ నుండి వచ్చిన హీరో పవన్ రెడ్డి కి మంచి భవిష్యత్ ఉండాలని కోరుతున్నాను. చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు రమేష్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. పోలీస్ డిపార్టుమెంటులో పని చేస్తూ సినిమాపై ఉన్న ప్యాషన్ తో రమేష్ ఈ రంగంలో అడుగుపెట్టారు. ట్రైలర్ అద్బుతంగా ఉంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా చేశారు. చిత్రం విజయవంతమై అందరికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. 

దర్శకుడు రమేష్ మాట్లాడుతూ "13 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాను. దర్శకత్వ శాఖలో నాకు ఎలాంటి అనుభవం లేదు. పవన్ రెడ్డి గారు రాసుకున్న కథకు నేనైతే న్యాయం చేయగలనని దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా పెద్దగా చేసాం. చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.     

పవన్ రెడ్డి మాట్లాడుతూ "త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మంచి సంగీతం, సాహిత్యం అందించిన రమేష్ ముక్కెర, లోకేష్ లకు థాంక్స్" అని చెప్పారు. 

ప్రశాంత్ మాట్లాడుతూ "రమేష్ ముక్కెర మా నాన్నగారు పాటలకు మంచి సంగీతం అందించారు. చిత్ర పరిశ్రమలో మంచి స్థానంలో ఉంటాడని అప్పుడే ఊహించాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు 

ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ "సంగీత దర్శకుడిగా రమేష్ మంచి పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి సంగీతంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా అతనకి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement