Advertisementt

హైదరాబాద్‌లో చరణ్‌, శ్రీను వైట్ల సినిమా.!

Wed 03rd Jun 2015 01:32 AM
ramcharan new movie,srinu vaitla,rakul preeth singh,dvv danayya  హైదరాబాద్‌లో చరణ్‌, శ్రీను వైట్ల సినిమా.!
హైదరాబాద్‌లో చరణ్‌, శ్రీను వైట్ల సినిమా.!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో ‘నాయక్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన డి.వి.వి.దానయ్య మళ్ళీ చరణ్‌తో శ్రీను వైట్ల డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఈరోజు(జూన్‌ 3) నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌లతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు. మే 21 నుంచి 30 వరకు యూరప్‌లో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లపై పాటల చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌తోపాటు కృతి కర్బంద కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు అందరు టాప్‌ హీరోలతో సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన శ్రీను వైట్ల ఫస్ట్‌ టైమ్‌ రామ్‌చరణ్‌తో చేస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాడు నిర్మాత డి.వి.వి.దానయ్య. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా మరో పక్క జరుగుతోంది. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ