Advertisement

హాలీవుడ్‌ రేంజ్‌లో వున్న ‘బాహుబలి’ ట్రైలర్‌.!

Tue 02nd Jun 2015 02:25 AM
bahubali trailer release,ss rajamouli,prabhas,anushka,tamanna,rana  హాలీవుడ్‌ రేంజ్‌లో వున్న ‘బాహుబలి’ ట్రైలర్‌.!
హాలీవుడ్‌ రేంజ్‌లో వున్న ‘బాహుబలి’ ట్రైలర్‌.!
Advertisement

ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి ఈమధ్య 10 సెకన్ల టీజర్‌ను రిలీజ్‌ చేసిన రాజమౌళి ఈరోజు రెండు నిముషాల 5 సెకన్ల ట్రైలర్‌ రిలీజ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రెండు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్‌లో ‘బాహుబలి’ ట్రైలర్‌ను ప్రదర్శించడంతో కేవలం ట్రైలర్‌ చూడడానికే ఆయా థియేటర్లలో జనం క్యూ కట్టారు. ఈ ట్రైలర్‌తో ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతిని కలిగించాడు రాజమౌళి. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విజువల్స్‌, ఫైట్‌ సీక్వెన్స్‌లతో ట్రైలర్‌లోని ప్రతి షాట్‌ హాలీవుడ్‌ సినిమాలను గుర్తు తెచ్చేలా వున్నాయి. సెట్టింగ్స్‌గానీ, గ్రాఫిక్‌ వర్క్‌గానీ కన్నుల పండువలా అనిపించాయి. ఈ ట్రైలర్‌లో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కొన్ని సీన్స్‌కి సంబంధించిన షాట్స్‌ని మాత్రమే చూపించారు. పాటలకు సంబంధించిన ఒక్క బిట్‌ కూడా చూపించలేదు. రెండున్నర గంటల సినిమాని రెండు నిముషాల ట్రైలర్‌లో సినిమా ఏ రేంజ్‌లో వుంటుందో చూపించడంలో రాజమౌళి హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి. ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరగడం ఖాయం. 

Click Here to see the Bahubali The Beginning Official Trailer 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement