Advertisementt

‘జ్యోతిలక్ష్మీ’ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది

Mon 01st Jun 2015 05:51 AM
charmi new movie jyothi lakshmi,puri jagannath,c.kalyan,jyothi lakshmi title song  ‘జ్యోతిలక్ష్మీ’ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది
‘జ్యోతిలక్ష్మీ’ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది
Advertisement
Ads by CJ

ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్‌ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్‌ బ్యానర్స్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను జూన్‌ 1న  విడుదల చేశారు. 

>‘జ్యోతిలక్ష్మీ.. జ్యోతిలక్ష్మీ ఐ యామ్‌ కాస్ట్‌లీ టు టచ్‌ మి...

>ఏయ్‌ రాసుకోర సాంబ.. నేనల్లాటప్పా కాదు..

>ట్రై చేసుకోర సాంబ.. నేనార్డినరీ కాదు..’

అంటూ భాస్కరభట్ల రాసిన పాటను సునీల్‌ కశ్యప్‌ సంగీత సారధ్యంలో ఉమా నేహా గానం చేశారు. ఈ పాటతోపాటు ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం మేకింగ్‌ వీడియో కూడా విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ` ‘‘ఈరోజు మా ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను, మేకింగ్‌ వీడియోను విడుదల చేశాం. భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించిన ఈ పాటను ఉమా నేహా చాలా అద్భుతంగా పాడారు. సునీల్‌ కశ్యప్‌ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేశారు. జూన్‌ 4న జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ చిత్రం ఆడియోను చాలా డిఫరెంట్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. జూన్‌ 12న వరల్డ్‌వైడ్‌గా మా ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్‌గారికి, ఛార్మికి, మా బేనర్‌కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. 

ఛార్మి, సత్య, వంశీ  ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కెమెరా: పి.జి.విందా, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ