Advertisementt

'కేరింత' రిలీజ్ కు రెడీ..!

Mon 01st Jun 2015 05:46 AM
kerintha,release date,dil raju,saikiran adavi,sumanth aswin  'కేరింత' రిలీజ్ కు రెడీ..!
'కేరింత' రిలీజ్ కు రెడీ..!
Advertisement
Ads by CJ

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ చిత్రాన్ని జూన్12 న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ "కొత్త బంగారులోకం' సినిమా తరువాత తక్కువ బడ్జెట్ లో కొత్తవాళ్ళతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాం. 'కేరింత' స్టొరీ సాయి చెప్పగానే నాకు నచ్చి ఓకే చెప్పాను. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నిజమైన స్నేహం, ప్రేమ అంశాలతో సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

దర్శకుడు సాయికిరణ్ అడవి మాట్లాడుతూ "సినిమా కంప్లీట్ అవ్వడానికి ప్రతి టెక్నీషియన్ ఎంతగానో సహకరించారు. అందరు ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. మిక్కి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. జూన్ 12న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్న ఈ సినిమా అందరిని అలరిస్తుందని భావిస్తున్నాను" అని చెప్పారు.

సంగీత దర్శకుడు మిక్కి జె మేయర్ మాట్లాడుతూ "రామజోగయ్యశాస్త్రి గారు మంచి సాహిత్యాన్ని అందించారు. సినిమాలో పాటలు అధ్బుతంగా వచ్చాయి" అని చెప్పారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ