మహేష్ పిక్స్ చేశాడు!

Mon 01st Jun 2015 05:02 AM
maheshbabu,srimanthudu,srimanthudu on 17 july,shruthihassan,maheshbabu,brahmosthsavam   మహేష్ పిక్స్ చేశాడు!
మహేష్ పిక్స్ చేశాడు!
Advertisement
Ads by CJ
డౌటే లేదంటున్నాడు మ‌హేష్‌. ముందు చెప్పిన‌ట్టుగానే త‌న `శ్రీమంతుడు` చిత్రాన్ని జులై 17న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం ఖాయం అని తేల్చిచెప్పేశాడు. `బాహుబ‌లి` జులై 15న విడుద‌ల‌వుతున్న‌ట్టు డేట్ ఫిక్స్ అయ్యింది. దీంతో మ‌హేష్ సినిమా వ‌స్తుందో రాదో అనే సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేవి. అయితే మ‌హేష్ మాత్రం వెన‌క్కి త‌గ్గేదే లేదంటున్నాడు. `శ్రీమంతుడు` టీజ‌ర్‌ని కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆదివార‌మే విడుద‌ల చేశారు. ఆ టీజ‌ర్‌కి చ‌క్క‌టి రెస్పాన్స్ వ‌స్తోంది. 13 గంట‌ల‌కే యూట్యూబ్‌లో 5 ల‌క్ష‌ల వ్యూస్‌కి చేరువైంది. 24 గంటల్లోపు ఆ టీజ‌ర్ మ‌రిన్ని రికార్డులు సొంతం చేసుకొనేలా క‌నిపిస్తోంది. టీజ‌ర్‌కి వ‌స్తున్న స్పంద‌న అద్భుతంగా ఉంద‌నీ మ‌హేష్ ట్వీట్ చేశాడు. అదే సంద‌ర్భంలోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాడు. జులై 17న నా జీవితంలో మ‌రో గుర్తుండిపోయే రోజు అవుతుంద‌ని ట్వీట్ చేశాడు మ‌హేష్‌. 
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ