Advertisementt

పెళ్లిపై స్పందించిన త్రిష‌..!

Sun 31st May 2015 12:07 PM
trisha,trisha marriage cancel,actress trisha,lion movie,trisha new movie  పెళ్లిపై స్పందించిన త్రిష‌..!
పెళ్లిపై స్పందించిన త్రిష‌..!
Advertisement
Ads by CJ
ఎట్ట‌కేల‌కు త‌న పెళ్లి గురించి నోరు విప్పింది త్రిష‌. వ్యాపార వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో వివాహం ర‌ద్ద‌యిన విష‌యాన్ని ఒప్పుకొంది. చెన్నైలో ఓ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆ విష‌యం గురించి త్రిష కాస్త డీటైల్డ్‌గానే మాట్లాడింది.  అందరూ అనుకొంటున్న‌ట్టుగా వ‌రుణ్‌తో పెళ్లి ర‌ద్ద‌యిన విష‌యం వాస్త‌వ‌మే అనీ... ఇది ఊహించ‌ని ప‌రిణామ‌మ‌మే అయినా కొన్నిసార్లు ప‌రిస్థ‌తులు మ‌న చేయి దాటి పోయిన‌ప్పుడు  త‌లొగ్గ‌క త‌ప్ప‌ద‌ని వేదాంతం మాట్లాడింది. అయినా పాత విష‌యాలు మాట్లాడుకోవ‌డం ఇప్పుడు వృథా అనీ, ఇప్పుడు త‌న దృష్టంతా సినిమాల‌పైనే ఉంద‌ని స్ప‌ష్టం చేసింది  త్రిష‌. మ‌రి పెళ్లి విష‌యంలో ఏం ఆలోచిస్తున్నార‌ని అడిగితే.. ``ఒక్క పెళ్ల‌నే కాదు, నా జీవితానికి సంబంధించిన ప్ర‌తీదీ ఆ దేవుడే చూసుకొంటాడు. నేను ఆ దేవుడి బిడ్డ‌ను. ఆయ‌న చూపిన దారిలోనే వెళ‌తా`` అని చెప్పుకొచ్చింది త్రిష‌. మొత్త‌మ్మీద ఆమె మాటలు వింటుంటే... ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ వ్య‌వ‌హారం త్రిష‌ని మాన‌సికంగా బాగా ఇబ్బంది పెట్టిన‌ట్టు అనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె తెలుగు, త‌మిళంలో చిత్రాలు ఒప్పుకొంటూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ