ఇంక అదరగొట్టుడే..!

Sun 31st May 2015 09:58 AM
adaragottu movie,adaragottu movie opening,adaragottu movie launch,manoj nandam,nilofer  ఇంక అదరగొట్టుడే..!
ఇంక అదరగొట్టుడే..!
Advertisement
Ads by CJ

అదరగొట్టు మూవీ ప్రారంభం

ఆర్‌.కె. ఫిల్మ్‌ ఫ్యాక్టరీస్‌ పతాకంపై మనోజ్‌నందం, నీలోఫర్‌ హీరో, హీరోయిన్లుగా దర్శకనిర్మాత ఎమ్‌. రాజ్‌కుమార్‌ రూపొందించనున్న చిత్రం ‘అదరగొట్టు’. ఈ చిత్రం ఇటీవలే హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఫైనాన్షియర్‌     ఎమ్‌.ఆర్‌. చౌదరి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రపు తొలి సన్నివేశానికి రియల్టర్‌ కె.బి. ప్రసాద్‌ క్లాప్‌ నివ్వగా, ఎస్‌.బి.హెచ్‌ మేనేజర్‌ వి.ఎస్‌. నాయుడు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 

అనంతరం దర్శకనిర్మాత ఎమ్‌. రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ..‘ మంచి కథ కుదిరింది. మా టీమ్‌తో నిజంగానే అదరగొట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాము. జూన్‌ 15 నుండి రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. చిత్రంలోని సాంగ్స్‌ని అమెరికాలో చిత్రీకరణ జరుపనున్నాము..’ అని తెలిపారు. 

మనోజ్‌నందం, నీలోఫర్‌ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ధరణికోట, సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటర్‌: రమేష్‌, ఆర్ట్‌: కృష్ణ, కెమెరా: విజయ్‌కుమార్‌, సమర్పణ: వర్ధినేని రవీందర్‌రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వాసు, సహనిర్మాత: జె.వి. నాయుడు, నిర్మాత-దర్శకుడు: ఎమ్‌. రాజ్‌కుమార్‌. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ