జూన్‌ 1న టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ అవుతోంది.!

Sat 30th May 2015 11:15 AM
charmi in jyothi lakshmi,jyothi lakshmi on 12th june,jyothi lakshmi audio on 4th june  జూన్‌ 1న టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ అవుతోంది.!
జూన్‌ 1న టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ అవుతోంది.!
Advertisement
Ads by CJ

ఛార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఈ చిత్రం ఆడియో జూన్‌ 4న, సినిమా జూన్‌ 12న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పబ్లిసిటీని రొటీన్‌కి భిన్నంగా ప్లాన్‌ చేస్తున్న పూరి జగన్నాథ్‌ ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ని మొదట రిలీజ్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్‌ సాంగ్‌ చాలా కీలకమైందని భావించిన పూరి జూన్‌ 1న ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ని మొదట రిలీజ్‌ చేసి జూన్‌ 4న ఆడియో ఫంక్షన్‌ని కూడా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నాడు. జూన్‌ 12న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేశాడు. అలాగే ఛార్మి కెరీర్‌లో లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చాలా చేసినప్పటికీ ఇలాంటి డిఫరెంట్‌ జోనర్‌లో సినిమా చెయ్యడం మాత్రం ఫస్ట్‌ టైమ్‌ అని చెప్పాలి. ఇలా హీరోయిన్‌కి, డైరెక్టర్‌కి ఇది కొత్త తరహా సినిమా అని చెప్పొచ్చు. ఇన్ని ప్రత్యేకతలు వున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో, పూరికి, ఛార్మికి ఎలాంటి సక్సెస్‌ని అందిస్తుందో వెయిట్‌ అండ్‌ సీ.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ